Huzurabad: అక్టోబర్‌లో హుజూరాబాద్ ఉపఎన్నిక..?

హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరగనుంది.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మొత్తం తన వైపుకు తిప్పుకున్న ఈ ఉపఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చలు సహజమే. మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్ పై ఆరోపణలు, మంత్రి పదవి నుండి తొలగింపు, శాసనసభకు రాజీనామా, అనంతరం బీజేపీలో చేరిక ఇలా వరసగా తెలంగాణ రాజకీయాలలో వంద రోజుల సినిమా చూపించేయగా.. ఇప్పుడు ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది.

Huzurabad: అక్టోబర్‌లో హుజూరాబాద్ ఉపఎన్నిక..?

Huzurabad (1)

Huzurabad: హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరగనుంది.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మొత్తం తన వైపుకు తిప్పుకున్న ఈ ఉపఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చలు సహజమే. మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్ పై ఆరోపణలు, మంత్రి పదవి నుండి తొలగింపు, శాసనసభకు రాజీనామా, అనంతరం బీజేపీలో చేరిక ఇలా వరసగా తెలంగాణ రాజకీయాలలో వంద రోజుల సినిమా చూపించేయగా.. ఇప్పుడు ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది. ఎవరికి వారు ఇక్కడ గెలుపుతో తమ ప్రాబల్యాన్ని చాటుకోవాలని ఆరాటపడుతున్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక స్ట్రాటజీలను అవలంభిస్తూ జెండా పాతేయాలని పంతంతో ఉండగా అసలు ఉపఎన్నికలు ఎప్పుడు జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశంలో ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో చాలా కీలక రాష్ట్రాలు, కీలక నియోజకవర్గాలలో ఈ ఉపఎన్నిక కోసం అతృతతో ఎదురుచూస్తున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుండి ఏపీలో బద్వేల్ వరకు ఉపఎన్నికల వరకు చాలా కీలక నియోజకవర్గాలున్నాయి.

దేశంలో ఉపఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఆగష్టు నెలాఖరులోపు అభిప్రాయాలను అందించనుండగా అనంతరం వాటిని సమీక్షించేందుకు ఈసీ కొంత సమయం తీసుకొనే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ఈనెలాఖరు వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించబోమని ఈసీ స్పష్టం చేయగా బద్వేల్ ఉపఎన్నిక ఇప్పుడు కీలకంగా కనిపిస్తుంది. ఏపీలోని బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మృతి చెందిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది.

బద్వేల్ లెక్కప్రకారం చూస్తే సెప్టెంబర్ 28లోపు ఇక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. ఖాళీ అయిన ఆరు నెలల్లోపే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయాలనే నిబంధన ప్రకారం బద్వేల్ స్థానంలో ఉపఎన్నిక కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. అనంతరం 45 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే హుజూరాబాద్ నుండి పశ్చిమబెంగాల్ వరకు అన్నీ ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంటుంది. దీని లెక్క ప్రకారం హుజూరాబాద్ ఉపఎన్నికలు కూడా సెప్టెంబర్ నెలాఖరున నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో ఒక చర్చ జరుగుతుంది.

హుజూరాబాద్ ఉపఎన్నికలపై బీజేపీ కోటిఆశలతో ఉంది. ఈటల గెలుపుతో మరోసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బల్లగుద్ది చెప్పాలని ఆలోచనలో ఉండగా టీఆర్ఎస్ అంతకు మించిన పక్కా వ్యూహంతో తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తుంది. ఇక, కాంగ్రెస్ కొత్త రధసారధిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత పార్టీకి నూతన ఉత్తేజాన్ని కలిగిందనే భావనకు హుజూరాబాదే సెంటర్ అఫ్ పాలిటిక్స్ గా కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా హుజూరాబాద్ టార్గెట్ గా రాష్ట్ర రాజకీయాలను సెట్ చేసుకుంటుంది. మరి, సెప్టెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయా.. లేక కరోనా థర్డ్ వేవ్ భయంతో ఈసీ మరికొన్నాళ్లు వాయిదా వేసే అవకాశం ఉందా అన్నది చూడాల్సి ఉంది.