Huzurabad By Poll : లెక్కింపు ఇలా..రెండు హాళ్లు, మొత్తం 14 టేబుళ్లు, 22 రౌండ్లు

ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 

Huzurabad By Poll : లెక్కింపు ఇలా..రెండు హాళ్లు, మొత్తం 14 టేబుళ్లు, 22 రౌండ్లు

Huzurabad

Huzurabad By Election 2021 : హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. కరీంనగర్‌లోని కౌంటింగ్‌ కేంద్రమైన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోకి ఉదయం ఆరు గంటల నుంచే అభ్యర్థులు, ఏజెంట్లను అనుమతించిన అధికారులు.. ఓట్ల లెక్కింపును మొదలుపెట్టనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ మొదలుకానుంది. ఉదయం 8 గంటల నుంచి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఈ బైపోల్‌లో మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది.

Read More : Telugu States By-poll: నేడు తేలనున్న హుజురాబాద్, బద్వేల్ నేతల భవితవ్యం

ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.  ఏకకాలంలో అన్ని టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో పోలయిన ఓట్లను.. 22 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్​కు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం వల్ల తుది ఫలితం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Read More : Murder : దారుణం.. పొట్టిగా ఉందని ఫ్రెండ్స్ హేళన చేయడంతో ప్రియురాలిని చంపేశాడు

మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. హుజూరాబాద్​లోని పోతిరెడ్డిపేట ఓట్లతో కౌంటింగ్‌ స్టార్ట్ కానుండగా… కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామం ఓట్లతో కౌంటింగ్‌ ఎండ్ కానుంది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా వుండటం… పోలింగ్ శాతం కూడా భారీగా నమోదవడంతో గతంలో కంటే కాస్త ఆలస్యంగానే ఫలితం వెలువడనుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహరీ సాగనుండటంతో చివరి రౌండ్ వరకు ఫలితం దోబూచులాడనుంది. రౌండ్‌రౌండ్‌కి టెన్షన్‌ పెంచే అవకాశం ఉంది.

Read More : శభాష్ పోలీస్ అన్న.. రైతుల తరుపున కొట్లాట _ SI Supports Farmers In Miryalaguda

సాయంత్రం 4 గంటల తర్వాత మొత్తం ఫలితం తేలనుంది. ఈ ఉపఎన్నిక కౌంటింగ్‌ కోసం సిబ్బంది, సూపర్ వైజర్లకు ఇప్పటికే శిక్షణనిచ్చారు. ఎలాంటి సాంకేతిక సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఓట్ల లెక్కింపు జరగనున్న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వద్దే కాకుండా సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 700మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ టు జగిత్యాల రోడ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.