Huzurabad By Poll : ఐడీ కార్డు లేదా..నో ఎంట్రీ..బైఠాయించిన ఏజెంట్లు

కౌంటింగ్ ఏజెంట్లకు గేట్ పాస్ తో పాటు వ్యక్తిగత ఐడీ కార్డు తప్పనిసరి పోలీసులు చెప్పారు. ఐడీ కార్డు లేకపోవడంతో కొంతమంది ఏజెంట్లను గేటు వద్దే ఆపేశారు.

10TV Telugu News

Huzurabad By Poll Counting : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం 22 రౌండ్లలో ఫలితం తేలనుండగా.. కౌంటింగ్‌ కోసం 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. కరీంనగర్‌లోని కౌంటింగ్‌ కేంద్రమైన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోకి ఉదయం ఆరు గంటల నుంచే అభ్యర్థులు, ఏజెంట్లను అధికారులు అనుమతించారు.

Read More : North Koreans : ఆకలి తీరాలా, నల్ల హంసలు తినండి..కిమ్ సూచన

అయితే…కౌంటింగ్ ఏజెంట్లకు గేట్ పాస్ తో పాటు వ్యక్తిగత ఐడీ కార్డు తప్పనిసరి పోలీసులు చెప్పారు. ఐడీ కార్డు లేకపోవడంతో కొంతమంది ఏజెంట్లను గేటు వద్దే ఆపేశారు. దీంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. గేట్ నెంబర్ 02 వద్ద బైఠాయించారు. కౌంటింగ్ హాల్లో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కానుంది. ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లు అధికారులు ఓపెన్ చేయనున్నారు. Evm ల లెక్కింపు కు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఒక్కో రౌండ్లో 10 వేల వరకు ఓట్ల లెక్కింపు జరుగనుంది.

మరో వైపు..
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. బద్వేల్‌ కౌంటింగ్ కూడా జరుగుతున్నా.. అందరి దృష్టి మాత్రం హుజూరాబాద్‌ పైనే ఉంది. గెల్లు శ్రీనివాస్‌, ఈటల రాజేందర్‌ మధ్య పోటాపోటీ ఉండగా.. పందేలు కూడా అదే రేంజ్‌లో సాగుతున్నట్టు సమాచారం.

ఉదయం 8 గంటల నుంచి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.
మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి.
పోస్టల్ ఓట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది.
ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు

ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు
ఈవీఎంలలో పోలయిన ఓట్లు.. 22 రౌండ్లలో లెక్కింపు
మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్ల లెక్కింపు
పోతిరెడ్డిపేట ఓట్లతో కౌంటింగ్‌ స్టార్ట్..కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామం ఓట్లతో కౌంటింగ్‌ ఎండ్
సాయంత్రం 4 గంటల తర్వాత తేలనున్న ఫలితం

×