Huzurabad Bypoll : మా గెలుపు ఖాయం, తేలాల్సింది మెజార్టీ మాత్రమే

ఎన్నికల్లో ఎవరు గెలిస్తే లాభమో హుజూరాబాద్ ఓటర్లు తెలుసుకోవాలి. అభివృద్ధి అనేది అధికారంలో ఉంటేనే జరుగుతుంది. రాజేందర్ గెలిచేది లేదు, మంత్రి అయ్యేది లేదు, ప్రజలకు చేసేది లేదు..

Huzurabad Bypoll : మా గెలుపు ఖాయం, తేలాల్సింది మెజార్టీ మాత్రమే

Huzurabad Bypoll

Huzurabad Bypoll : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దేనని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక తేలాల్సింది మెజార్టీ మాత్రమే అని చెప్పారు. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే లాభమో హుజూరాబాద్ ఓటర్లు తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి అనేది అధికారంలో ఉంటేనే జరుగుతుందన్నారు. ఈటల రాజేందర్ పోయిపోయి బోకరు పార్టీలో చేరాడని హరీష్ రావు అన్నారు. రాజేందర్ గెలిచేది లేదు, మంత్రి అయ్యేది లేదు, ప్రజలకు చేసేది లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాలు, రోడ్లు, ఎల్ ఐసి.. ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్న బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని హరీష్ రావు అడిగారు.

Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

”తెలంగాణ వచ్చాక లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్. వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్, ఐటీ హబ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తున్న పార్టీ టీఆర్ఎస్. మరి నీ బోకరు బీజేపీ పార్టీ ఎం చేసిందో చెప్పు రాజేందర్. ఆసరా పెన్షన్, వడ్డీ లేని రుణాలు, వృద్దాప్య పెన్షన్ ఇచ్చింది టీఆర్ఎస్. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసింది రాజేందర్. నేను చెబుతున్నా.. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించుకుంటే హుజురాబాద్ నియోజకవర్గంలో 5వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తాం” అని హరీష్ రావు హామీ ఇచ్చారు.

Harvard Professor: మనుషులంతా ఏలియన్లు చేసిన ప్రయోగమే.. – హార్వర్డ్ ప్రొఫెసర్

” రైతు చట్టాలు చేస్తాం. బావులకు కూడా మీటర్లు పెడతాం అంటున్నారు. రైతు కడుపు మాడ్చి రైతుల ఉసురు పోసుకునే బీజేపీకి ఎందుకు ఓటేయాలి. రాజేందర్ నిన్ను చూసి కాళేశ్వరం వచ్చిందా? నిన్ను చూసి రైతు బంధు వచ్చిందా? నిన్ను చూసి కేసీఆర్ కిట్టు వచ్చిందా? రాజేందర్ తన స్వార్థం కోసం బీజేపీలో చేరాడు. బీజేపీ ఏమిచ్చింది మనకు. డీ-మానిటేజేషన్ అని చెప్పి నల్లధనం బయటకి తెచ్చి ఒక్కొక్కరి బాంక్ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం అన్నారు. పేదలను దంచి పెద్దలకు పెట్టిన ప్రభుత్వం బీజేపీ.

WhatsApp self-chat: చిన్న ట్రిక్‌తో వాట్సప్‌లో సెల్ఫ్ మెసేజ్!

రైతు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పెద్ద పెద్ద కంపెనీలకు మాఫీ చేసింది బీజేపీ పార్టీ. రైతులకు రైతు బంధు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ అయితే రైతుల పై బందూకులు పెట్టిన పార్టీ బీజేపీ. ఈటల రాజేందర్ ని కేసీఆర్ పెంచి పెద్ద చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్టు బీజేపీలో చేరాడు ఈటెల రాజేందర్. ఓటేసిన నాడు వంట రూమ్ లో సిలిండర్ కి దండం పెట్టాలి, బీజేపీ పార్టీని బొంద పెట్టాలి. టీఆర్ఎస్ గుర్తు మీద ఒత్తితే ఢిల్లీలో బీజేపీ పార్టీ గూబ గుయ్యి మనాలి. టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి” అని హరీష్ రావు అన్నారు.