HCA : హెచ్ సీఏ కీలక నిర్ణయాలు..అధ్యక్షుడు అజారుద్దీన్ లేకుండానే మీటింగ్ | Hyderabad Cricket Association takes Key decisions

HCA : హెచ్ సీఏ కీలక నిర్ణయాలు..అధ్యక్షుడు అజారుద్దీన్ లేకుండానే మీటింగ్

9 మంది ఉన్న జనరల్ బాడీని 19కి పెంచుతూ రెసొల్యూషన్‌ పాస్ చేశారు. అధ్యక్షుడు లేకుండానే మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

HCA : హెచ్ సీఏ కీలక నిర్ణయాలు..అధ్యక్షుడు అజారుద్దీన్ లేకుండానే మీటింగ్

HCA Decisions : హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అధ్యక్షుడు అజారుద్దీన్ లేకుండానే సమావేశం జరిగింది. అలాగే అజర్‌ లేకుండానే నిర్ణయాలు తీసుకునేందుకు ప్లాన్ చేశారు. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని మాజీ అధ్యక్షులు అంటున్నారు.

ఇవాళ సికింద్రాబాద్‌ మినర్వా గ్రాండ్‌లో జరిగిన స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 9 మంది ఉన్న జనరల్ బాడీని 19కి పెంచుతూ రెసొల్యూషన్‌ పాస్ చేశారు. అధ్యక్షుడు లేకుండానే మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

Azharuddin : హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు

జనరల్ బాడీ మీటింగ్‌లో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్‌ ఆయూబ్‌, శివ లాల్ యాదవ్, మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్, జాన్ మనోజ్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ లేకుండానే సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్  నిర్వహించామంటున్నారు.

హైదరాబాద్ క్రికెట్‌కు పూర్వ వైభవం తెస్తమని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అంటున్నారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ నిర్వహిస్తామని మాజీ అధ్యక్షులు అన్నారు.

×