Hyderabad Drugs Case : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే భారీ మొత్తంలో

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగర శివారులో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా.. హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 180 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Drugs Case : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే భారీ మొత్తంలో

Hyderabad Drugs Case : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగర శివారులో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా.. హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 180 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న నైజీరియన్ ను అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ చరిత్రలో మొదటి సారిగా భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది.

హైదరాబాద్‌లో తరుచుగా డ్రగ్స్ గుప్పుమనడం కలకలం రేపుతోంది. మాదకద్రవ్యాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో రకంగా మాదకద్రవ్యాలను నగరానికి తీసుకొస్తున్నారు. యువత టార్గెట్‌ గా డ్రగ్స్ సప్లయ్ జరుగుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం సైలెంట్‌గా దందా కానిస్తున్నారు. తాజాగా.. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే భారీ ఎత్తున కొకైన్ పట్టుబడటం సంచలనంగా మారింది.

Also Read..Hyderabad Drugs : బాబోయ్.. హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, ఏకంగా రూ.50 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఒక నైజీరియన్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో సరఫరా చేస్తుండగా.. అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి ఏకంగా 180 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దొరికిన కొకైన్ కేసుల్లో ఇదే అధిక మొత్తం కావటం గమనార్హం.

డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. హైదరాబాద్ కు భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలో పోలీసులు నిఘా పెంచారు. పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ ముఠాల భరతం పడుతున్నారు. డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేసి కేటుగాళ్లను జైలుకి పంపుతున్నారు. నిన్నమొన్నటి వరకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు తెప్పించిన ముఠాలు ఇప్పుడు రూట్ మార్చి హైదరాబాద్ నుంచే విదేశాలకు సరఫరా చేస్తున్నాయి.

Also Read..Huge Sex Racket Gang Arrest : భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు.. జాబ్స్, లగ్జరీ లైఫ్ పేరుతో వ్యభిచారం

నగరంలో రోజుకో చోట డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎంత కట్టడి చేస్తున్నా డ్రగ్స్ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుల వ్యవధిలో కోట్లాది రూపాయల డ్రగ్స్ ను సీజ్ చేశారంటే.. మత్తు పదార్ధాల మాఫియా ఎంతగా బరి తెగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా చాపకింద నీరులా డ్రగ్ మాఫియా తమ దందా కొనసాగిస్తోంది.

డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు రూపుమాపేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు. అయినా కొన్ని ముఠాలు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి సప్లయ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు మరింత నిఘా పెంచారు. డ్రగ్స్ మాఫియా అంతు చూస్తామంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.