కూ..చుక్ చుక్ : హైదరాబాద్ రోడ్లపై రైలు

కూ..చుక్ చుక్ : హైదరాబాద్ రోడ్లపై రైలు

light rail transit system : హైదరాబాద్ మహానగరంలో రైలు కూతలు వినిపించబోతున్నాయి. ఇప్పటికే రైళ్లు తిరుగుతున్నాయి కదా..అంటారు. అయితే… బస్సు ప్రయాణం మాదిరిగానే..రోడ్డుపైన ఏర్పాటు చేసే ట్రాక్ ల మీదుగా..వచ్చే ట్రైన్ ను ఎక్కేసి..గమ్యానికి చేరుకోవచ్చు. ట్రాఫికర్ లేని కాలుష్య రహిత ప్రయాణంపై అధికారులు ఫోకస్ పెట్టారు. కేపీహెచ్ బీ లోని జేఎన్టీయూ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి కోకాపేట వరకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకరావడంపై..హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు అనుబంధమైన యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టేషన్ అథార్టీ (ఉమ్టా) అధ్యయనం చేస్తోంది. దాదాపు 28 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు సాధ్యసాధ్యాలపై కసరత్తులు జరుగుతున్నాయి. గత మూడు నెలల నుంచి దీనిపై అధ్యయనం చేస్తోంది. తర్వలోనే ప్రభుత్వానికి ఓ నివేదిక అందచేయనుంది.

కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీ, రాయదుర్గం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, ఓఆర్‌ఆర్‌ మీద నుంచి కోకాపేట వరకు ఈ రవాణా మార్గం అనువుగా ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు 28 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారి కుడివైపున మీటర్‌ గేజ్‌ ఏర్పాటు చేసి బ్యాటరీ ఆపరేటింగ్‌ లేదంటే విద్యుత్‌ సరఫరాతో ఈ రైలును నడపనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే..మెట్లు ఎక్కి..టికెట్ తీసుకుని రైలులో ప్రయాణించాలంటే..దాదాపు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతోంది.

అదే లైట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తే..నేరుగా రహదారిపై బస్సులు ఎక్కినట్లుగానే..ప్రయాణికులు ఆయా స్టాప్ ల వద్ద టికెట్లు తీసుకుని ఎక్కేయొచ్చు. నగరవాసుల సమయం మరింత ఆదా కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రాఫిక్‌ తిప్పలుండవు.. అలాగే ఈ సేవల వల్ల కాలుష్యం తగ్గుతుందంటున్నారు. పేదలు కూడా ఎక్కేలా తక్కువ చార్జీలకే ఈ సేవలు అందుబాటులో తీసుకరావాలని భావిస్తున్నారు. ఇటు పర్యాటకంగా మరింత అభివృద్ధి బాటలు పట్టే చాన్స్‌ ఉంది.