Free WiFi : హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్, ఉచితంగా వై-ఫై సౌకర్యం

హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్. ఇకపై పనిమీద బయటకు వెళ్లినవారు వై-ఫై లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఉచితంగా వై-ఫైని ఉపయోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Free WiFi : హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్, ఉచితంగా వై-ఫై సౌకర్యం

Free Wifi

hyderabad free wifi public hotspots : హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్. ఇకపై పనిమీద బయటకు వెళ్లినవారు వై-ఫై లేదని బాధపడాల్సిన అవసరం లేదు. 45 నిమిషాలపాటు ఉచితంగా వై-ఫైని ఉపయోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మూడు వేల రద్దీ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో యాక్ట్ ఫైబర్ నెట్ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్రి కేటీఆర్ లాంఛనంగా దీన్ని ప్రారంభించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వై-ఫై ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని వారితో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడారు. తానన్న ఒకే ఒక్క మాటతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారంటూ యాక్ట్ ఫైబర్ నెట్ సీఈవో బాల మల్లాదికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇదే అతిపెద్ద పబ్లిక్ వై-ఫై అని పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ఓపెన్ వై-ఫైని నెలకు 3 లక్షల మంది వరకు వినియోగించుకుంటున్నట్టు బాల మల్లాది చెప్పారు.