Hyderabad: ప్రేమ పేరుతో మోసం.. బాయ్ ఫ్రెండ్‌ను కత్తితో పొడిచిన ప్రేయసి
తనకు జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని దాడికి పాల్పడింది ఓ యువతి. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగిన ఘటనపై వివరాలు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Knife-attack
Hyderabad: తనకు జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని దాడికి పాల్పడింది ఓ యువతి. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగిన ఘటనపై వివరాలు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న వారిద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి.
దీంతో ప్రియుడు దూరం పెట్టడం మొదలుపెట్టాడు. తనను మోసం చేస్తున్నాడనే కోపంతో యువతి దాడిచేసి కత్తితో పొడిచింది. స్థానికులు అప్రమత్తమై ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడు. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి : వాడకం అంటే అమూల్‌దే..