Hyderabad Crime : HCUలో దారుణం ..థాయ్ లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..

అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ రవి రంజన్ కీచకుడిగా మారాడు. థాయ్ లాండ్ కు చెందిన ఓ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు.దీంతో సదరు విద్యార్థిని అప్రమత్తమైన అతడినుంచి తప్పించుకుని పారిపోయింది. విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచార యత్నం చేశాడని తెలుసుకున్న విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రొఫెసర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి.

Hyderabad Crime : HCUలో దారుణం ..థాయ్ లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..

HCU professor rape attempt on thailand student

Hyderabad Crime : అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ రవి రంజన్ కీచకుడిగా మారాడు. థాయ్ లాండ్ కు చెందిన ఓ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు.దీంతో సదరు విద్యార్థిని అప్రమత్తమైన అతడినుంచి తప్పించుకుని పారిపోయింది. విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచార యత్నం చేశాడని తెలుసుకున్న విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రొఫెసర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. విదేశాల నుంచి భారత్ కు వచ్చి చదువుకునే విద్యార్ధుల జీవితాలను పాడు చేయానుకునే ఇటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వర్శిటీ గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనపై వర్శిటీ గేటు వద్దకు చేరుకున్న విద్యార్ధి సంఘాలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో యూనివర్శిటీ గేట్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ఉన్నత విద్య కోసం థాయ్ లాండ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థినిపై.. హెచ్ సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచార యత్నం చేశాడు. దీంతో భయపడిపోయిన సదరు విద్యార్థిని ప్రొఫెసర్ బారి నుంచి తప్పించుకుంది. అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టెషన్ కు చేరుకొని… పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యూనివర్సిటీ విద్యార్థులు…ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రొఫెసర్ రవిరంజన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. యూవివర్సిటీ గేటు ముందు పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు… ప్రొఫెసర్ ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. విద్యార్థిని ఫిర్యాదుతో ప్రొఫెసర్ రవిరంజన్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. 354 ఐపీసీ కింద కేసు నమోదు చేశాము. బుక్ కోసం క్యాంపస్ బయటికి పిలిచి అత్యాచారం చేయబోయినట్లుగా తెలుస్తోంది.