Hyderabad T20 Match : అమ్ముడుపోయాయా? అమ్ముకున్నారా? హైదరాబాద్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో భారీ కరెప్షన్?

అజారుద్దీన్ మళ్లీ కవర్ డ్రైవ్ ఆడాడు. జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాటలో హెచ్ సీఏ తప్పేమీ లేదని సమర్థించుకున్నాడు. మ్యాచ్ అన్నాక చిన్న చిన్న ఘటనలు జరుగుతాయంటూ కొట్టిపారేశాడు. టిక్కెట్లను బ్లాక్ లో విక్రయించలేదని స్పష్టం చేసిన అజర్.. 13వేల టిక్కెట్లు గోల్ మాల్ అయ్యాయంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Hyderabad T20 Match : అమ్ముడుపోయాయా? అమ్ముకున్నారా? హైదరాబాద్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో భారీ కరెప్షన్?

Hyderabad T20 Match : అజారుద్దీన్ మళ్లీ కవర్ డ్రైవ్ ఆడాడు. జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాటలో హెచ్ సీఏ తప్పేమీ లేదని సమర్థించుకున్నాడు. మ్యాచ్ అన్నాక చిన్న చిన్న ఘటనలు జరుగుతాయంటూ కొట్టిపారేశాడు. టిక్కెట్లను బ్లాక్ లో విక్రయించలేదని స్పష్టం చేసిన అజర్.. 13వేల టిక్కెట్లు గోల్ మాల్ అయ్యాయంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

టిక్కెట్ల కోసం వచ్చి క్రికెట్ ఫ్యాన్స్ లాఠీ దెబ్బలు తిన్నారన్న పట్టింపు లేదు. ఆడవాళ్లు, పిల్లలు గాయపడ్డారన్న బాధ లేదు. అసలు తొక్కిసలాట గురించి చింతే లేదు. అదే తొండాట, అదే నిర్లక్ష్యం. సూటిగా ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ చెప్పకుండా అదే కప్పదాటు వైఖరి. మా తప్పు లేదు, మేము అక్రమాల చేయలేదు అంటూ.. చెప్పిందే మళ్లీ చెప్పాడు అజారుద్దీన్.

క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం అంత ఈజీ కాదు. పదే పదే ఇదే మాట చెబుతున్నాడు అజారుద్దీన్. కాదని ఎవరన్నారు? కానీ, మ్యాచ్ ను సక్రమంగా నిర్వహించడానికి అజార్ అండ్ టీమ్ ఉందన్న విషయన్నా మర్చిపోతే ఎలా అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. హైదరాబాద్ కంటే ముందు రెండు నగరాల్లో మ్యాచ్ లు జరిగాయి. అక్కడ టిక్కెట్ల అమ్మకం సాఫీగా జరగ్గా.. మన దగ్గర మాత్రమే ఎందుకు రచ్చ జరిగింది. ఫ్యాన్స్ ఎందుకు లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది? తొక్కిసలాట ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలకు అజర్ నుంచి సూటిగా సమాధానాలు రావడమే లేదు. పైగా, తొక్కిసలాటతో తమకు సంబంధమే లేదని చెప్పుకొచ్చారు. టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముకున్నారు అనే ఆరోపణలను మాత్రం అజార్ ఖండించారు. తాము టికెట్లను బ్లాక్ చేయలేదని, బ్లాక్ లో టికెట్లు అమ్మితే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

టిక్కెట్ల అమ్మకాల్లోనూ హెచ్ సీఏకు సంబంధం లేదన్నారు అజార్. పేటీఎం ద్వారా టికెట్లను విక్రయించామన్నారు. ఇందులో ఎలాంటి కన్ ఫ్యూజన్ అక్కర్లేదని కూడా చెప్పారు.

టీ20 మ్యాచ్ కోసం ఎన్ని టికెట్లు అమ్మారు అనే విషయంపైనా అజారుద్దీన్ క్లారిటీ ఇవ్వలేకపోయారు. సెప్టెంబర్ 15న ఆన్ లైన్ లో 11వేల 450 టికెట్లు, మరోసారి 3వేల టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించామని చెప్పారు. అలాగే జింఖానా గ్రౌండ్స్ దగ్గర ఆఫ్ లైన్ లో 2వేల100 టికెట్లు, ఇంటర్నల్ గా మరో 6వేల టికెట్లు, 4వేల కార్పొరేట్ బాక్స్ టికెట్లు అమ్మినట్లు చెప్పారు. ఈ లెక్కన మొత్తం 26వేల 550 టికెట్లు సేల్ అయినట్లు అజార్ చెబుతున్నారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ 39వేలు కాగా.. అజార్ చెప్పిన లెక్కల ప్రకారమే మరో 12వేల 450 టికెట్ల తేలాల్సి ఉంది. అవన్నీ ఏమయ్యాయని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు టికెట్ల అమ్మకాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు. పేటీఎంకు కాంట్రాక్ట్ ఇవ్వడంలోనే భారీగా అవకతవలు జరిగాయన్నారు. 20 నిమిషాల్లో 30వేలకు పైగా టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని ఆయన ప్రశ్నించారు. టికెట్లను వాళ్లే కొనేసి బ్లాక్ లో భారీ ధరకు అమ్ముకుంటున్నారని కొండా ఆరోపించారు. ఒక్కో టికెట్ ను 20వేల రూపాయలు, 30వేల రూపాయలకు అమ్ముతున్నారని చెప్పారు. ఇది చాలా పెద్ద స్కామ్ అని, చరిత్రలో ఎన్నడూ ఇలాంటి స్కామ్ జరగలేదన్నారు.

ఇక ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 2వేల 500 మంది పోలీసు సిబ్బందితో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. స్టేడియం లోపల, బయట కలిపి 300 సీసీ కెమెరాలు బిగించామన్నారు. మ్యాచ్ పై ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా ఉంటుందన్నారు.

మరోవైపు అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అవినీతికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని కమిషన్ ను కోరారు.