Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్‌ 20లో హైదరాబాద్‌

ఏపీఏసీ సస్టైనబిలిటీ ఇండెక్స్ 2021లోని మొదటి 20 స్థిరమైన నగరాల్లో 4 భారతీయ నగరాలు ఉన్నాయి. వీటిలో బెంగళూరు, ఢిల్లీ తర్వాత, స్థిరమైన వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది.

Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్‌ 20లో హైదరాబాద్‌

Hydearabad

Hyderabad :హైదరాబాద్‌ మరో ఘనత సాధించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలోని భారత దేశ నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ‘యాక్టివ్‌ క్యాపిటల్‌ ఏసియా పసిఫిక్‌- రైజింగ్‌ క్యాపిటల్‌ ఇన్‌ అన్‌సర్టెన్‌ టైమ్స్‌’ పేరుతో తాజాగా ఒక జాబితా విడుదల చేసింది.

పట్టణీకరణ ఒత్తిడి, వాతావరణ ప్రమాదం, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ కార్యక్రమాల ఆధారంగా 36 నగరాలకు రేటింగ్ ఇచ్చింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సింగపూర్, సిడ్నీ, వెల్లింగ్టన్, పెర్త్, మెల్బోర్న్ వంటి నగరాలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో మొదటి ఐదు గ్రీన్-రేటెడ్ నగరాల జాబితాలో ఉన్నాయి.

హైదరాబాద్ మరో ఘనత.. భారత్‌లో బెస్ట్‌ సిటీ భాగ్యనగరం.. నివాసానికి, ఉపాధికి ఉత్తమం

ఏపీఏసీ సస్టైనబిలిటీ ఇండెక్స్ 2021లోని మొదటి 20 స్థిరమైన నగరాల్లో 4 భారతీయ నగరాలు ఉన్నాయి. వీటిలో బెంగళూరు, ఢిల్లీ తర్వాత, స్థిరమైన వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. స్థిరమైన అభివృద్ధిని సృష్టించేందుకు రియల్ ఎస్టేట్ రంగం నిబద్ధతకు ఇది మంచి సూచన అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ చెప్పారు.

భారత్ లో స్థిరమైన అభివృద్ధి వృద్ధిని కొత్త మార్కెట్ డైనమిక్స్ ప్రోత్సహించాయని తెలిపారు. ప్రపంచ నిబద్ధత పర్యావరణ అనుకూల ప్రమాణాలైన కార్బన్ న్యూట్రాలిటీ, నెట్ జీరోపైలపై ప్రధానంగా దృష్టి సారించాయని పేర్కొన్నారు. భారతీయ డెవలపర్లు తమ అవసరాలకనుగుణంగా ఉత్పత్తులను పెంచుకోవడానికి ఇది తోడ్పడిందని వివరించారు.