Hyderabad Liberation Day: ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.. హాజరైన అమిత్ షా

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తుండగా, బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహిస్తోన్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమర వీరులకు నివాళులర్పించారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, కర్ణాటక మంత్రి బి.శ్రీరాములు, తదితరులు హాజరయ్యారు.

Hyderabad Liberation Day: ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.. హాజరైన అమిత్ షా

Hyderabad Liberation Day

Hyderabad Liberation Day: తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తుండగా, బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహిస్తోన్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమర వీరులకు నివాళులర్పించారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, కర్ణాటక మంత్రి బి.శ్రీరాములు, తదితరులు హాజరయ్యారు.

మరోవైపు, బీజేపీ తెలంగాణ కార్యాలయంలో విమోచన వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ సర్దార్ వల్లభాయి పటేల్ చిత్ర పటానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. సర్దార్ వల్లభాయి పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందని చెప్పారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికి తెలంగాణకు స్వేచ్ఛ వచ్చిందని ఆయన అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా ఎందరో పోరాడి త్యాగాలు చేశారని తెలిపారు.

అంతకు ముందు హైదరాబాద్ నాంపల్లిలోని అసెంబ్లీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాళులు అర్పించారు. మరోవైపు, నేడు టీఆర్ఎస్ సర్కారు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తోంది. ఇవాళ సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహిస్తోంది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు ర్యాలీలు, జెండా ప్రదర్శనలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో అంబేద్కర్, గాంధీ విగ్రహాల వద్ద స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించారు. అసెంబ్లీ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. కాసేపట్లో పబ్లిక్‌ గార్డెన్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ భాగంగా జాతీయ జెండా ఎగురవేయనున్నారు.

Rainfall alert for Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం