Hyderabad Lockdown : ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు లైన్ క్లియర్!

హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. జొమాటో, స్విగ్గీ డెలివరీ చేసే వారిని అడ్డుకోమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Hyderabad Lockdown : ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు లైన్ క్లియర్!

Hyd Lock Down

Food Delivery Boy! : హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. జొమాటో, స్విగ్గీ డెలివరీ చేసే వారిని అడ్డుకోమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు నగర పోలీసు కమీషనర్లతో చర్చించి..ఈ నిర్ణయం తీసుకున్నామంటూ..వెల్లడించారు. అటు ఈ కామర్స్ సర్వీసులకు కూడా..ఈ వెసులుబాటు ఉంటుందని పోలీస్ బాస్ తెలిపారు.

లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడంతో…ఫుడ్ డెలివరీ బాయ్స్ తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఆంక్షలను ప్రజలు ఇష్టానురీతంగా ఉల్లంఘిస్తుండడంతో కఠిన చర్యలు తీసుకున్నారు పోలీసులు. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ ను కూడా అడ్డుకున్నారు. వారి వాహనాలను సీజ్ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారిపోయింది.

ఉదయం 10 గంటల తర్వాత..రోడ్లపై తిరుగుతున్న స్విగ్గీ..జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాలను అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఫుడ్ డెలివరీ బాయ్స్. సమస్యను పరిష్కరించాలంటూ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు. పోలీసులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.

Read More : COVID-19 Positive: పోలీస్ స్టేషన్లో పది మందికి కరోనా పాజిటివ్, సీల్ వేసిన అధికారులు