Black Market : బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్ల దందా..వ్యక్తి అరెస్ట్‌

కరోనా, బ్లాక్‌ఫంగస్‌తో నానా అగచాట్లు పడతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్‌ మార్కెట్లో అమ్ముతూన్న కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కరోనా కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమరాయుళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్లను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

10TV Telugu News

black marketing black fungal injection : కరోనా సోకి కోలుకున్నవారిని బ్లాక్ ఫంగస్ భయాందోళనలకు గురిచేస్తోంది. కరోనానుంచి తప్పించుకున్నా..బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకోవటానికి మరోసారి ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈక్రమంలో బ్లాక్ మార్కెట్ లో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ల దందా కొనసాగుతోంది. బ్లాక్ ఫంగస్ కు సంబంధించి మందులు అక్రమంగా అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఇటువంటివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా చాటుమాటుగా బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు దందాలు కొనసాగుతునే ఉన్నాయి. ఈక్రమంలో పోలీసులు బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కరోనా, బ్లాక్‌ఫంగస్‌తో నానా అగచాట్లు పడతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్‌ మార్కెట్లో అమ్ముతూన్న కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కరోనా కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమరాయుళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్లను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

సరూర్‌నగర్‌ ప్రాంతంలో ఇంజక్షన్లను అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడు కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అనంతరం అతని వద్ద ఉన్న ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని అతని వెనుక ఎవరున్నారు? ఇంకా ఇటువంటి ఇంజెక్షన్ల స్టాకు ఉందా?ఇంజక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో విచారిస్తున్నారు. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35 వేలకు అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు.

10TV Telugu News