Rain In Telangana : తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

Moderate rains
Rain In Telangana : తెలంగాణలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు తీవ్ర ఎండలు మరోవైపు వానలతో జనాలు సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే మరోవైపు వర్షాలు కూడా కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో శనివారం నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాబోయే 48 గంటలు పాక్షికంగా మేగావృతమే ఉంటుందని సాయంత్రం లేదా రాత్రి సమయంలో మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రం మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో 4 రోజులపాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు… పలు చోట్ల వడగళ్ల వర్షం.. మరో రెండు రోజులు వానలే!
నైరుతి దిశ నుంచి గంట 4 నుంచి 6 కిలో మీటర్ల వేగతంతో గాలులు వీచే అవకాశం ఉందని
దీని ప్రభావంతో గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
ఇక శుక్రవారం సాయంత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. భద్రాచలంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. యోగా నర్సింహ్మ స్వామిదేవాలయంలో ధ్వజ స్తంభంపై పిడుగు పడింది. సూర్యపేట జిల్లాలోని చింతలపాలెం, మేలచెరువు, మటంపల్లి మండలాల్లో వర్షం దంచికొట్టింది.
Rains In Telangana: తెలంగాణలో పలు చోట్ల వానలు.. హైదరాబాద్‌లోనూ చిరు జల్లులు
ఈదురు గాలులతో కూడిన వాన పడింది. ఆకస్మికంగా వర్షం పండటంతో మిర్చి పంట రైతులు పంటను కాపాడుకుంనేందుకు పరుగులు తీశారు. అకాల వర్షంతో ఇబ్బంది పడుతున్న రైతులకు మటంపల్లి పోలీసులు అండగా నిలిచారు. రఘునాథపాలెం శివారులో వర్షాలకు తడుస్తున్న మిర్చి పంటకు పరదాలు కప్పి సాయం చేశారు.