Telangana: తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం.. ఎక్కడెక్కడంటే?
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయవ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.

Telangana Rains
Telangana – Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ (Meteorological) అధికారులు తెలిపారు. ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసరాల్లోని ఒడిశా ప్రాంతాల్లో ఒక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని చెప్పారు.
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయవ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో ఇవాళ అక్కడక్కడ, రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉరుములు , మెరుపులు, ఈదురు గాలులుతో (గాలి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. అంతేగాక, ఇవాళ, రేపు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
Hyderabad, Delhi airfares Hike : ఒడిశా రైలు ప్రమాదం తర్వాత విమాన టికెట్ల ధరలు మూడు రెట్లు పెంపు