Hyderabad MMTS: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లకు నేడూ బ్రేక్

గరంలోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు.

Hyderabad MMTS: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లకు నేడూ బ్రేక్

Trains

Hyderabad MMTS: హైదరాబాద్ మహానగరంలో ప్రజారవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవరిస్తున్న ఎంఎంటీఎస్ రైళ్ల సేవలను రద్దు చేసింది దక్షిణమధ్య రైల్వే. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో శని ఆదివారాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు. అయితే పనులు ఇంకా కొనసాగుతుండాడంతో సోమవారం నాడు కూడా రైళ్ల సేవలను నిలిపివేశారు. జంట నగరాల్లో మొత్తం 79 ఎంఎంటీఎస్ సర్వీసులు కొనసాగుతుండగా.. సోమవారం నాడు పలు రూట్లలో 36 సర్వీసులను నిలిపివేశారు రైల్వేశాఖ అధికారులు.

Also read: Bank Cheating: ప్రైవేట్ బ్యాంకు పేరుతో వందలాది మందికి కుచ్చుటోపీ

సికింద్రాబాద్‌-లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య 2(1-1) సర్వీసులను, లింగంపల్లి-నాంపల్లి-లింగంపల్లి మధ్య 18(9-9) సర్వీసులను ఫలక్‌నుమా-లింగంపల్లి- ఫలక్‌నుమా మధ్య 16(8-8) సర్వీసులను రద్దు చేసినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో ప్రయాణికులు ప్రత్యామ్న్యాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు తెలిపారు. రైళ్ల పునరుద్ధరణపై సోమవారం సాయంత్రం లేదా మంగళవారం నాడు మరో ప్రకటన చేసే అవకాశం ఉంది.

Also read: Indian Army: ఇండియన్ ఆర్మీ “యూనిఫామ్” గురించి 5 ఆసక్తికర అంశాలు