New Year Restrictions: న్యూఇయర్ సెలబ్రేషన్స్‌.. నగరంలో అర్థరాత్రి నుంచి ఆంక్షలు

నేటితో 2021కి గుడ్‌ బై చెప్పబోతున్నాం. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం.

New Year Restrictions: న్యూఇయర్ సెలబ్రేషన్స్‌.. నగరంలో అర్థరాత్రి నుంచి ఆంక్షలు

New Year Restrictions

New Year Restrictions: నేటితో 2021కి గుడ్‌ బై చెప్పబోతున్నాం. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. దీంతో ఈ రెండు రోజుల పాటు భారీ సెలబ్రేషన్స్‌కి సిద్ధమయ్యారు యూత్‌. అయితే, ఈసారి కఠిన నిబంధనలు, ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. మాస్క్‌ల్లేకుండా బయటకు రాకూడదని స్పష్టం చేశారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ సిటీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇవాళ(31 డిసెంబర్ 2021) అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. NTR మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్‌లో వాహనాల రాకపోకలకు అనుమతిలేదని పోలీసులు ప్రకటించారు.

BRK భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాల ట్రాఫిక్ తెలుగు తల్లి జంక్షన్ దగ్గర ఇక్బాల్ మినార్, లక్డికాపూల్‌, అయోధ్య వైపు మళ్లిస్తారు. లిబర్టీ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ఎగువ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లక్డికాపూల్ వైపు మళ్లిస్తారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం సచివాలయానికి ఆనుకుని ఉన్న మింట్ కాంపౌండ్ లేన్‌ మూసివేయనున్నారు.

నల్లకుంట రైల్వే బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాల రాకపోకలు కర్బలా మైదాన్ లేదా మినిస్టర్స్ రోడ్డు వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంది. బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లపై రాకపోకలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అలాగే ఇవాళ విధుల్లో ఉండే క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు.

క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు విధుల్లో యూనిఫామ్‌లో ఉండి అన్ని వాహన డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, క్యాబ్ డ్రైవర్లు రైడ్‌కు అనుమతి నిరాకరిస్తే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు. ఇక రాత్రి అంతా పోలీసులు డ్రంక్‌ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఆరు నెలల జైలుశిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తారు.