YS Sharmila Arrest : YS షర్మిల అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు

YS షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం స్టేషన్ కు తరలించారు.

YS Sharmila Arrest : YS షర్మిల అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు

Ys Sharmila Arrest

YS Sharmila Arrest : YS షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం స్టేషన్ కు తరలించారు. తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల అవకాశం దొరకినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు.సీఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించటానికి కూడా వెనుకాడటంలేదు. రాష్ట్రంలో ఎన్నో డిపార్ట్ మెంట్ లలో వేలాది పోస్టుల్ని భర్తీ చేయాలని..నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పెట్టినప్పటినుంచి పలు కార్యక్రమాలు చేపడుతున్న షర్మిల తాజాగా తెలంగాణలో ఉద్యోగాల కోసం డిమాండ్ చేస్తు..రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తూ… హైదరాబాద్‌ నాంపల్లిలో టీఎస్​పీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ కార్యకర్తలతో కలిసి బైఠాయించి… ఆందోళన చేపట్టారు.ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు వైయస్ షర్మిల ఆందోళనకు దిగి..ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు..సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… రోడ్డుపై బైఠాయించారు. దీంతో గంటకుపైగా ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

ఉద్యోగాల కోసం డిమాండ్ చేసే షర్మిల తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం షర్మిల తన తోటి నేతలతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బి జనార్దన్ రెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధినేత్రి వైయస్ వినతి పత్రం అందజేశారు.