Fake Police : ఇంటర్ కూడా పాస్ కాలేదు.. డీఎస్పీ అంటూ ఫోజు కొట్టాడు.. చివరకు జైలుపాలయ్యాడు

 ఓ ఫేక్ డీఎస్పీ బాగోతం బట్టబయలైంది.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన ఫేక్ డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి డీఎస్పీ డ్రెస్ వేసుకొని ఓ వాహనానికి డిఎస్పీ స్టిక్కర్ అంటించి రోడ్లపై తిరుగుతూ అందినకాడికి దోచుకునేవాడు.

Fake Police : ఇంటర్ కూడా పాస్ కాలేదు.. డీఎస్పీ అంటూ ఫోజు కొట్టాడు.. చివరకు జైలుపాలయ్యాడు

Fake Police

Fake Police : ఓ ఫేక్ డీఎస్పీ బాగోతం బట్టబయలైంది.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన ఫేక్ డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి డీఎస్పీ డ్రెస్ వేసుకొని ఓ వాహనానికి డిఎస్పీ స్టిక్కర్ అంటించి రోడ్లపై తిరుగుతూ అందినకాడికి దోచుకునేవాడు.

ఇసుక లారీలు ఆపి వారిని బెదిరించి డబ్బులు లాగే వాడు. అంతేకాదు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తెలంగాణలోని 5 జిల్లాలకు చెందిన 20 మంది నిరుద్యోగుల నుంచి సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడు. అయితే ఇతడు ఇంటర్ మీడియట్ కూడా పాస్ అవకుండా డీఎస్పీ ఎలా అయ్యాడని అనుమానించిన కొంతమంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ను ఆశ్రయించడంతో వ్యవహారం బయటకు వచ్చింది.

అతడు ఫేక్ డీఎస్పీ అని తేల్చిన టీఎస్పీఎస్సీ సభ్యులు.. హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫేక్ డీఎస్పీని అరెస్ట్ చేశారు. డబ్బుల మోజులో ఏకంగా పోలీస్ వేషమే వేసిన స్వామి ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు.