ఇన్ స్టంట్ యాప్ లోన్ కేసులో నలుగురు అరెస్టు

ఇన్ స్టంట్ యాప్ లోన్ కేసులో నలుగురు అరెస్టు

Four arrested in instant app loan case :  స్కైలైన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ పేరుతో గురుగావ్ కేంద్రంగా పని చేస్తున్న ఆన్‌లైన్ యాప్ లోన్ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వహణ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైనాకు చెందిన జియాంగా యాంగ్ అనే వ్యక్తితో కలిసి ఉమాపతి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆన్‌లైన్ లోన్ యాప్ కంపెనీలు సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై RBI అధికారులతో కూడా చర్చిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.  సైబరాబాద్‌లో 8 కేసులు రిజిస్టర్ అయినట్లు పేర్కొన్నారు.

వేధింపులకు గురైన వారు తప్పని సరిగా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రైవేటు యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవద్దన్నారు.