ఒకే నెంబర్ పై రెండు వెహికల్స్..ఫైన్ వేసిన హైదరాబాద్ పోలీసులు..లబోదిబోమంటున్న సిరిసిల్ల వాసి

  • Published By: madhu ,Published On : August 15, 2020 / 01:22 PM IST
ఒకే నెంబర్ పై రెండు వెహికల్స్..ఫైన్ వేసిన హైదరాబాద్ పోలీసులు..లబోదిబోమంటున్న సిరిసిల్ల వాసి

బైక్ కు హైదరాబాద్ పోలీసులు జరిమాన వేయడంతో సిరిసిల్ల వాసి లబోదిబోమంటున్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేయడం ఏంటీ ? సిరిసిల్ల వాసి బాధ పడడం ఏంటీ ? అంతా గందరగోళంగా ఉంది అనుకుంటున్నారు కదా..



పూర్తి వివరాల్లోకి వెళితే..
సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ లో యూసుఫ్ హుస్సేన్ మహ్మద్ నివాసం ఉంటున్నాడు. ఇతనికి AP 13 E 2646 సీడీ బైక్ 100 బైక్ ఉంది. ఇదిలా ఉంటే..ఫైన్ వేసినట్లు సెల్ కు మెసేజ్ వచ్చింది. వెంటనే ఇంటర్ నెట్ లో సెర్చ్ చేశాడు. వివరాలు చూసి షాక్ తిన్నాడు.



2020, ఆగస్టు 12వ తేదీ ఉదయం 11.07 గంటలకు కుషాయిగూడ పీఎస్ పరిధిలో ECIL X Road లో రాంగ్ సైడ్ లో డ్రైవింగ్ చేసినట్లు ఉంది. ఇందుకు రూ. 1135 డబ్బు కట్టాలని సూచించింది. తాను సిరిసిల్లలో ఉంటే..హైదరాబాద్ ఈసీఎల్ లో డ్రైవింగ్ చేయడం ఏంటీ ? అంటూ క్వొశ్చన్ మార్క్ వచ్చేలా ముఖం పెట్టాడు.

అంటే..ఇదే నెంబర్ గల బైక్ ఇంకోటి (గ్లామర్)గా ఉందని నిర్దారించాడు. స్థానిక అవసరాలకు మినహా బయటకు తీసుకెళ్లే అవసరం లేదని వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.