29 Days, 24 Lakhs : వామ్మో.. కరోనా చికిత్సకు 29 రోజులకు రూ.24లక్షల బిల్లు.. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం

కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చికిత్స పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. ట్రీట్ మెంట్ అయ్యాక ఆసుపత్రులు ఇచ్చే బిల్లు చూసి బాధితుల గుండె గుబేల్ మంటోంది. తాజాగా హైదరాబాద్ నాగోల్ లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి కరోనా చికిత్సకు గాను 29 రోజులకు ఏకంగా 24లక్షలు బిల్లు వేసింది.

29 Days, 24 Lakhs : వామ్మో.. కరోనా చికిత్సకు 29 రోజులకు రూ.24లక్షల బిల్లు.. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం

29 Days, 24 Lakhs

29 Days, 24 Lakhs : కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చికిత్స పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. ట్రీట్ మెంట్ అయ్యాక ఆసుపత్రులు ఇచ్చే బిల్లు చూసి బాధితుల గుండె గుబేల్ మంటోంది. తాజాగా హైదరాబాద్ నాగోల్ లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి కరోనా చికిత్సకు గాను 29 రోజులకు ఏకంగా 24లక్షలు బిల్లు వేసింది.

నాగోలు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుడి వైద్య ఖర్చులకు వేసిన బిల్లు చూసి బాధితుడి గుండె గుభేల్‌మంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఏప్రిల్‌ 15న ఈ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురువారం(మే 13,2021) డిశ్ఛార్జి చేసే ముందు రూ. 24 లక్షల బిల్లు చేతికిచ్చారు. దీంతో బాధితుడు, అతడి బంధువులు షాక్ తిన్నారు. రూ.24 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేయడంతో బాధితుడి బంధువులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకు కొవిడ్‌ బాధితుడికి ఐసీయూకు రూ. 9వేలు, ఆక్సిజన్‌ బెడ్‌కు రూ.7వేలు, సాధారణ వార్డుకు రూ.4వేలు చొప్పున మాత్రమే తీసుకోవాలి. కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా కష్టకాలంలో రోగులకు అండగా నిలవాల్సిన ఆసుపత్రులు అమానవీయంగా వ్యవహరిస్తున్నాయని, కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డబ్బులు దండుకునే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.