CP Mahesh Bhagwat : ఆ వ‌ర్షాల వీడియోలు వైర‌ల్ చేస్తే కేసులు, సీపీ వార్నింగ్

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో నగరం తడిసి ముద్దవుతోంది. ప‌లు కాల‌నీలు, రోడ్లు జ‌ల‌మ‌య‌మైన విషయం తెలిసిందే. అయితే, కొంద‌రు వ్యక్తులు వర్షానికి సంబంధించి పాత వీడియోల‌ను..

CP Mahesh Bhagwat : ఆ వ‌ర్షాల వీడియోలు వైర‌ల్ చేస్తే కేసులు, సీపీ వార్నింగ్

Cp Mahesh Bhagwat

CP Mahesh Bhagwat : గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో నగరం తడిసి ముద్దవుతోంది. ప‌లు కాల‌నీలు, రోడ్లు జ‌ల‌మ‌య‌మైన విషయం తెలిసిందే. అయితే, కొంద‌రు వ్యక్తులు వర్షానికి సంబంధించి పాత వీడియోల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత భ‌యాన్ని పెంచుతున్నారు. నగరంలో భారీ వరదలు వచ్చాయని, ఇళ్లు కూలిపోతున్నాయంటూ పాత వీడియోలను కొత్త వీడియోలుగా చూపుతూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.

దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అలాంటి వీడియోలు పోస్ట్ చేసేవారికి రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాత వీడియోల‌ను వైరల్‌ చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామ‌న్నారు. కాగా, వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే 100కు ఫోన్ చేసి చెప్పాల‌ని, సంబంధిత సిబ్బంది వెంట‌నే సాయం చేస్తార‌ని సీపీ వివ‌రించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆప‌దలో ఉన్న వారికి పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు అండ‌గా ఉండాల‌ని ఆయన కోరారు.

గ‌తేడాది హైదరాబాద్‌ ను వరదలు ముంచెత్తాయి. చాలా ఇళ్లు మునిగిపోయాయి. బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. ఎంతో మంది నిరాశ్ర‌యుల‌య్యారు. పలువురు గ‌ల్లంతయ్యారు. దారుణ‌మైన ప‌రిస్థితులు హైద‌రాబాద్ వాసులను వ‌ణికించాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొందరు ఆక‌తాయిలు రెచ్చిపోతున్నారు. సరదా కోసమో మరో కారణమో కానీ.. గతేడాది వరదలు వ‌చ్చిన‌ప్పుడు వైర‌ల్ అయిన వీడియోలను ఈసారి వ‌చ్చిన‌ట్టు చెబుతూ విప‌రీతంగా షేర్‌ చేస్తున్నారు. అవి చూసి జ‌నాలు భయపడిపోతున్నారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు అలాంటి వీడియోలు వైరల్ చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే తాట తీస్తామని హెచ్చరించారు.