Hyderabad Rains : హైదరాబాద్ వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ దంచికొట్టిన వర్షం.. నరకం చూస్తున్న జనం

హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దంటే వర్షాలు కురిపిస్తున్నాడు. మరోసారి నగరంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు చోట్ల వాన దంచికొట్టింది.

Hyderabad Rains : హైదరాబాద్ వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ దంచికొట్టిన వర్షం.. నరకం చూస్తున్న జనం

Hyderabad Rains : హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దంటే వర్షాలు కురిపిస్తున్నాడు. మరోసారి నగరంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు చోట్ల వాన దంచికొట్టింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

హైదరాబాద్ నగరాన్ని మరోసారి వాన ముంచెత్తింది. శనివారం సాయంత్రం నగర వ్యాప్తంగా రెండు గంటలుగా వర్షం దంచికొడుతోంది. కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, కోటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. నగరంలోని పలు చోట్ల ట్రాపిక్ జామ్ అయ్యింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇదిలా ఉంటే.. భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

హైదరాబాద్ ను వరుణుడు వీడటం లేదు. రోజూ తన ప్రతారం చూపిస్తున్నాడు. ఉదయం దంచి కొట్టే ఎండే, సాయంత్రం భారీ వర్షం.. కామన్ గా మారిపోయింది. శనివారం ఉదయం కూడా ఎండ దంచికొట్టింది. మధ్యాహ్నానికే సీన్ మారిపోయింది. ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్మేశాయి. నగరమంతా చీకటిగా మారిపోయింది. ఆ కాసేపటికే కుండపోతగా వర్షం కురిసింది.

ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లపైకి వరద చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామైంది. వాహనదారులు నరకం చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. హైదరాబాద్ కు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కురుస్తుందని అలర్ట్ చేసింది. హైదరాబాద్ తో పాటు మెదక్, వికారాబాద్, సిద్దిపేట్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇంకా వానలు కురుస్తాయని చెప్పడంతో కలవరపడుతున్నారు.