భారత్‌లో బెస్ట్ సిటీగా భాగ్య నగరం

  • Published By: vamsi ,Published On : September 16, 2020 / 08:39 AM IST
భారత్‌లో బెస్ట్ సిటీగా భాగ్య నగరం

విశ్వ నగరంగా మారి దేశంలోనే ది బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంటున్న హైదరాబాద్‌.. ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటూనే ఉంది. ప్రతీ ఏటా ఎన్నో సర్వేలు, ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలుస్తోంది. లేటెస్ట్‌గా హాలిడిఫై.కామ్‌ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నంబర్‌.1గా నిలిచింది.




భారత్‌లో అత్యంత నివాస యోగ్యమైన, సుస్థిరాభివృద్ది చెందిన, స్థిరమైన ఉపాధి కల్పించే నగరంగా హైదరాబాద్‌ అగ్ర స్థానంలో నిలిచినట్లు సర్వే వెల్లడించింది. దక్షిణ భారతదేశ న్యూయార్క్‌ సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందుతున్నట్లుగా ప్రశంసించింది.

అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక సర్వేలలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవగా.. దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలకు స్థానం కల్పిస్తూ, విభిన్న సంస్కృతుల కలబోతగా నిలుస్తున్న పట్టణాల ఆధారంగా ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో హైదరాబాద్‌కు 5 పాయింట్లకు గానూ 4 పాయింట్లు లభించినట్లు వెల్లడించింది.




హైదరాబాద్‌కు దక్కిన గుర్తింపుపై లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో కంగ్రాట్స్ చెప్పారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
https://10tv.in/muttspoken-english-clasesspoken-english-clasess-start-in-hyderabad-ramakrishnamutt/