Hyderabad Real Estate : హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇంటి ధరలు-ప్రపంచ వ్యాప్తంగా 128వ స్ధానం

ఇంటి ధరల పెరుగుదలలో హైదరాబాద్ 128 వ స్ధానంలో ఉందని స్ధిరాస్తి సేవల సంస్ధ నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్ధ చేసిన సర్వేలో తేలింది.

Hyderabad Real Estate : హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇంటి ధరలు-ప్రపంచ వ్యాప్తంగా 128వ స్ధానం

Hyderabad Real Estate

Hyderabad Real Estate : ఇంటి ధరల పెరుగుదలలో హైదరాబాద్ 128 వ స్ధానంలో ఉందని స్ధిరాస్తి సేవల సంస్ధ నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్ధ చేసిన సర్వేలో తేలింది. సంస్ధ మూడో త్రైమాసికానికి సంబంధించి ‘గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌’ ను విడుదల చేసింది.  టర్కీలోని ఇజ్మీర్ అత్యధిక వృధ్ది రేటు 34.8 శాతంతో మొదటి స్ధానంలో ఉండగా, న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ 33.5 శాతంతో రెండో స్ధానంలో ఉంది.

నైట్ ఫ్రాంక్ ఇండియా  సంస్ధ ప్రపంచ వ్యాప్తంగా 150 నగరాల్లో నిర్వహించిన తాజా నివేదిక ప్రకారం 2.5 శాతం పెరుగుదలతో హైదరాబాద్ 128వ స్ధానంలో నిలిచింది. దేశీయ స్ధాయిలో హైదరాబాద్ భారతీయ నగరాల్లో అత్యధిక ప్రజలు ఇష్టపడే నగరంగా నమోదయ్యింది.

Also Read : 5g services in hyderabad : హైదరాబాద్‌లో 5జీ నెట్ వర్క్ ట్రయల్ రన్

చెన్నై 2.2 శాతం పెరుగుదలతో 131 వ స్ధానం లో ఉంది. కోవిడ్ కారణంగా ప్రజల్లో సొంతిల్లు కొనుక్కోవాలని కోరిక ప్రబలటం… బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందించటం వల్ల కూడా భారీగా ఇళ్ళ ధరలు పెరిగాయి. కాగా బెంగుళూరు,ఢిల్లీ, పూణే, ముంబైలలో ఇళ్లధరలు తగ్గినట్లు నివేదిక పేర్కోంది.