Innovation House : కాంక్రీట్‌, సిమెంట్‌ లేకుండా రెడీమేడ్‌ ఇల్లు..అలా ఆర్డరిస్తే ఇలా చేసేస్తారు

కాంక్రీట్‌, సిమెంట్‌ లేకుండా రెడీమేడ్‌ ఇల్లు..అత్యాధునిక హంగులతో ఉన్న రెడీమేడ్ ఇల్లును చూస్తే మనం కూడా ఇటువంటిది కట్టించుకుంటే బాగుంటుందని కచ్చితంగా అనిపిస్తుంది. పెద్ద ఖర్చు కూడా అవ్వని ఈ ఇంటి గురించి ఎంతోమంది ఆసక్తిగా చెప్పుకుంటున్నారు.

Innovation House : కాంక్రీట్‌, సిమెంట్‌ లేకుండా రెడీమేడ్‌ ఇల్లు..అలా ఆర్డరిస్తే ఇలా చేసేస్తారు

Innovation House

Mobile house In Suryapet : ఇల్లు కట్టాలంటే చేతిలో డబ్బు ఉండాలి. అలాగే దగ్గరుండి కట్టించుకోవాలి. దాని కోసం ఓ మనిషి అయినా ప్రత్యేకంగా నిర్మాణం జరిగే చోట ఉండాలి. కానీ నేడు అలాకాదు. కాంట్రాక్ట్ కి ఇచ్చేయొచ్చు. లేదా బిల్డర్ కు డెవలప్ మెంట్ కు ఇచ్చేయొచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడంతా ఫాస్టుగా ఇళ్ల నిర్మాణాలు జరిగిపోతోంది. ఇలా ఇల్లు ఎలా కట్టుకున్నా..కట్టించుకున్నాగానీ ఇల్లు కట్టడానికి ఇసుక, సిమెంట్, కాంక్రీటు ఉండాల్సిందే. కానీ ఇప్పుడలా కాదు..సిమెంట్, కాంక్రీటు అవసరం లేకుండానే ఇల్లు కట్టేసే కొత్త పద్ధతులు వచ్చాయి. అదికూడా మన హైదరాబాద్ లోనే. అసలు సిమెంట్, కాంక్రీటు లేకుండా ఇల్లు కట్టటమేంటీ? ఎలాకడతారు? అనే డౌట్ వస్తుంది. అదే వినూత్న ఇల్లు నిర్మాణం.

సాధారణంగా ఇల్లు కట్టుకోవాలంటే మనకు స్థలం ఎక్కడైతే ఉందో అక్కడే కట్టుకుంటాం. కానీ ఈ వినూత్న ఇల్లు నిర్మాణం మాత్రం ఎక్కడో కట్టి మన స్థలంలోకి తెచ్చుకుని పెట్టేసుకోవటమే.అటువంటి వినూత్న ఇంటి నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని మొబైల్ హౌస్ అనొచ్చు.
హైదరాబాద్‌లోని కొంపెల్లిలో ఉన్న ఓ ప్రైవేట్‌ కంపెనీకి ఆర్డర్‌ ఇస్తే కాంక్రీట్‌ సిమెంట్‌ అవసరం లేకుండా ఫ్యాబ్రిక్‌ మెటీరియల్‌తో ఆధునిక హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చేస్తారు. ఇందులో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపోయే అన్ని వసతులు ఉన్నాయి. ఒక హాలు, బెడ్రూం, కిచెన్, టాయ్‌లెట్‌ ఉన్నాయి.

ఆధునిక హంగులతో ఈ రెడీమేడ్‌ ఇంటిని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన చింత అనంతరాంరెడ్డి ఈ వినూత్న ఇంటినికట్టించుకున్నారు. దాన్నికి రూ.6 లక్షలు ఖర్చు అయినట్లు అనంతరాంరెడ్డి తెలిపారు. ట్రాలీ లారీ సాయంతో ఇంటిని గ్రామానికి తీసుకొచ్చి తన వ్యవసాయ స్థలంలో ఏడెనిమిది అడుగుల ఎత్తులో నిర్మించి ఉన్న సిమెంట్ పిల్లర్లపై రెండు క్రేన్ల సాయంతో ఏర్పాటు చేసుకున్నారు. అదన్నమాట ఈ మొబైల్ వినూత్న హౌస్ స్పెషల్.కాంక్రీట్‌, సిమెంట్‌ లేకుండా రెడీమేడ్‌ ఇల్లు..అత్యాధునిక హంగులతో ఉన్న రెడీమేడ్ ఇల్లును చూస్తే మనం కూడా ఇటువంటిది కట్టించుకుంటే బాగుంటుందని కచ్చితంగా అనిపిస్తుంది. పెద్ద ఖర్చు కూడా అవ్వని ఈ ఇంటి గురించి ఎంతోమంది ఆసక్తిగా చెప్పుకుంటున్నారు.