Hyderabad: సర్టిఫికెట్లు పోగొట్టినందుకు రూ.1.15లక్షలు చెల్లించిన బ్యాంక్

ఓ మహిళకు నష్టపరిహారంగా రూ.1.15లక్షలు చెల్లించింది ఐసీఐసీఐ బ్యాంక్. కొద్ది కాలం పాటు ఐసీఐసీఐలో పనిచేసిన మహిళ తర్వాత జాబ్ మానేశారు శ్రీనిజ.

Hyderabad: సర్టిఫికెట్లు పోగొట్టినందుకు రూ.1.15లక్షలు చెల్లించిన బ్యాంక్

Compensation

Hyderabad: ఓ మహిళకు నష్టపరిహారంగా రూ.1.15లక్షలు చెల్లించింది ఐసీఐసీఐ బ్యాంక్. కొద్ది కాలం పాటు ఐసీఐసీఐలో పనిచేసిన మహిళ తర్వాత జాబ్ మానేశారు శ్రీనిజ. కానీ, తన ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో బ్యాంక్ ఫెయిలైంది. నిజానికి వాటిని పోగొట్టేసింది.

శ్రీనిజ లోక్ అదాలత్ ను సంప్రదించింది. ఈ విషయంపై శనివారం చర్చలు జరిపి నష్టపరిహారంగా శ్రీనిజకు రూ.1.15లక్షలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది.

మరో కేసులో.. జొమాటో డెలివరీ బాయ్ యాక్సిడెంట్ చేయడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. సికింద్రాబాద్ సివిల్ కోర్ట్ కేసు వేసి తనకు రూ.30వేలు నష్టపరిహారంగా ఇవ్వాలంటూ కోరింది. తన ఆర్థిక పరిస్థితి అంత మొత్తాన్ని ఒక్కసారిగా ఇచ్చుకునేంత గొప్పది కాదని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తానని అన్నాడు.

దానికి ఉపాయంగా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అతనికి రూ.30వేలు పర్సనల్ లోన్ గా ఇచ్చింది. ఆమెకు నష్టపరిహారం చెల్లించేసిన డెలివరీ బాయ్.. లోన్ మొత్తాన్ని కొద్ది రోజుల క్రిందటే పూర్తి చేశాడు.