Viral Fever : హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్న వైరల్ ఫీవర్లు.. పాటించాల్సిన జాగ్రత్తలు

హైదరాబాద్ నగర వాసులను వైరల్ ఫీవర్లు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ వణుకు పుట్టిస్తోంది. వైరల్ ఫీవర్ లక్షణాలతో చాలామంది ఫీవర్ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రుల

Viral Fever : హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్న వైరల్ ఫీవర్లు.. పాటించాల్సిన జాగ్రత్తలు

Viral Fever

Viral Fever : హైదరాబాద్ నగర వాసులను వైరల్ ఫీవర్లు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ వణుకు పుట్టిస్తోంది. వైరల్ ఫీవర్ లక్షణాలతో చాలామంది ఫీవర్ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రులకు వస్తున్నారు. అలాగే నగరంలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్ కు తరలి వెళ్తున్నారు. నగరం నుంచి కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జ్వర పీడితులు ఆసుపత్రులకు క్యూకట్టారు.

Rakul Preet Singh: షాకింగ్.. రకుల్ పెదవులకు సర్జరీ?

చాలా వరకు కేసులు కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఉంటున్నాయి. బ్యాక్టిరియా లేదా ఫంగీ కలిసిని నీరు, ఆహారం తీసుకోవడం వల్ల జ్వరాల బారిన పడుతున్నారు. టైఫాయిడ్, జాండిస్ బారిన పడుతున్నారు. మురికి వాడల్లో నివసించే వారు ఎక్కువగా బాధితులు అవుతున్నారు.

Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్

అందుకే వేడి వేడిగా ఉన్న ఆహారమే తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత నెలలో 95 డెంగీ కేసులు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు 50 కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ 800 నుంచి 900 మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ చెప్పారు. టైఫాయిడ్ ఇతర జ్వరాలు అక్టోబర్ వరకు ఇలానే కొనసాగుతాయని సీనియర్ డాక్టర్లు చెప్పారు.

హైదరాబాద్ లో సీజనల్ జ్వరాలు రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ వరకు ఇదే పరిస్థితి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీరే తాగాలి. వేడివేడిగా ఉన్న ఆహారమే తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో జ్వరాలు, రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని డాక్టర్లు చెప్పారు.