Microsoft : హైదరాబాద్ విద్యార్థిని ఘనత, రూ.2కోట్ల వేతనంతో మైక్రోసాఫ్ట్ లో జాబ్

హైదరాబాద్ నగరానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని దీప్తి తన టాలెంట్ తో సత్తా చాటారు. పేరు ప్రఖ్యాతలున్న సంస్థలో భారీ శాలరీతో జాబ్ సాధించారు. ఏకంగా ఏడాదికి రూ.2కోట్ల వేతనం అందుకోన్నారు.

Microsoft : హైదరాబాద్ విద్యార్థిని ఘనత, రూ.2కోట్ల వేతనంతో మైక్రోసాఫ్ట్ లో జాబ్

Microsoft Deepthi

Microsoft : హైదరాబాద్ నగరానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని దీప్తి తన టాలెంట్ తో సత్తా చాటారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాక్ పాట్ కొట్టారు. పేరు ప్రఖ్యాతలున్న సంస్థలో భారీ శాలరీతో జాబ్ సాధించారు. ఏకంగా ఏడాదికి రూ.2కోట్ల వేతనం అందుకోన్నారు.

అమెరికాలోని సియాటెల్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా దీప్తికి ఉద్యోగం లభించింది. వార్షిక వేతనం రూ.2 కోట్లు. యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో మే 2న ఎంఎస్‌(కంప్యూటర్స్‌) పూర్తి చేసిన దీప్తి క్యాంపస్‌ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు.

ఈ నెల 17న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీప్తి తండ్రి డాక్టర్‌ వెంకన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో క్లూస్‌టీం హెడ్ గా ఉన్నారు. బీటెక్‌ తర్వాత జేపీ మోర్గాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరిన యువతి మూడేళ్లు పని చేశారు. ఆ తర్వాత రిజైన్ చేసి ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించింది.