Hyderabad T20 Match : విరిగిన కుర్చీలు, పేరుకున్న దుమ్ము, లేచిన పైకప్పు.. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు దారుణం

ఉప్పల్ స్టేడియంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్టేడియంలో ఏర్పాట్లలోనూ హెచ్ సీఏ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 39వేల 400కు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ కుర్చీలు ఎక్కడికక్కడ విరిగిపడి ఉన్నాయి. ప్రేక్షకుల సీటింగ్ దారుణంగా ఉంది.

Hyderabad T20 Match : విరిగిన కుర్చీలు, పేరుకున్న దుమ్ము, లేచిన పైకప్పు.. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు దారుణం

Hyderabad T20 Match : ఉప్పల్ స్టేడియంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్టేడియంలో ఏర్పాట్లలోనూ హెచ్ సీఏ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 39వేల 400కు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ కుర్చీలు ఎక్కడికక్కడ విరిగిపడి ఉన్నాయి. ప్రేక్షకుల సీటింగ్ దారుణంగా ఉంది. అంతేకాకుండా కుర్చీలకు దుమ్ము పేరుకుపోయింది. అటు స్టేడియం పైకప్పు పనులు ఇంకా జరుగుతున్నాయి. స్టేడియంలో వసతులు సరిగా లేకపోవడంతో అభిమానులు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఆదివారం భారత్, ఆసీస్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ని లైవ్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, హైదరాబాద్ క్రికెట్ అసిసోయేషన్ తీరు.. దారుణంగా ఉంది. ఉప్పల్ స్టేడియంలో వసతుల విషయంలో హెచ్ సీఏ దారుణంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ 39వేల 400కు పైనే. కాగా, స్టేడియంలో వసతుల లోపం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. చాలా వరకు కుర్చీలు విరిగిపోయాయి. ఇక అనేక కుర్చీలపై దుమ్ము పేరుకుపోయింది. ఓవరాల్ గా చాలా చెత్తగా ఉంది. రూ.850 మొదలుకుని రూ.9వేల కార్పొరేట్ బాక్స్ వరకు టిక్కెట్స్ సేల్ అయ్యాయి. మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా, స్టేడియంలో సౌకర్యాల విషయానికి వస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రూట్ టాప్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని హెచ్ సీఏ చెబుతోంది. స్టేడియంలో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామంటోంది. కానీ, రియాల్టీలో చూస్తే భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. స్టేడియంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.

మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ కోసం భారత్ టూర్ కు వచ్చిన ఆస్ట్రేలియా.. ఒక మ్యాచ్ హైదరాబాద్ లో ఆడనుంది. ఈ నెల 25న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ లో చాలారోజుల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో మ్యాచ్ ని లైవ్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా ఉన్నారు.