Hyderabad T20 Match : సీటింగ్ కెపాసిటీ 32వేలు.. మిగితా 13వేల టిక్కెట్లు ఏమయ్యాయ్? టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలు?

ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎన్ని టిక్కెట్లు అమ్మారు? ఈ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు క్లారిటీ లేదా? ఆన్ లైన్ లో ఎన్ని అమ్మారు? ఆఫ్ లైన్ లో ఎంతమందికి ఇచ్చారు? లెక్కే లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిన్న చెప్పిన లెక్కకు ఇవాళ చెప్పిన లెక్కకు అసలు పొంతనే లేదు.

Hyderabad T20 Match : సీటింగ్ కెపాసిటీ 32వేలు.. మిగితా 13వేల టిక్కెట్లు ఏమయ్యాయ్? టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలు?

Hyderabad T20 Match : ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎన్ని టిక్కెట్లు అమ్మారు? ఈ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు క్లారిటీ లేదా? ఆన్ లైన్ లో ఎన్ని అమ్మారు? ఆఫ్ లైన్ లో ఎంతమందికి ఇచ్చారు? లెక్కే లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిన్న చెప్పిన లెక్కకు ఇవాళ చెప్పిన లెక్కకు అసలు పొంతనే లేదు.

సెప్టెంబర్ 15న ఆన్ లైన్ లో 11వేల 450 టిక్కెట్లు అమ్మామన్న అజార్.. మరోసారి 3వేల టిక్కెట్లు ఆన్ లైన్ లో అమ్మినట్లు వివరించారు. కార్పొరేట్ బాక్స్ కు సంబంధించి 4వేల టిక్కెట్లు సేల్ అయ్యాయన్నారు. జింఖానా గ్రౌండ్స్ లో 2వేల 100 టిక్కెట్లు ఇంటర్నల్ గా అమ్మామని, 6వేల టిక్కెట్లు విక్రయించామన్నారు.

కాగా, ఉప్పల్ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ 32వేలకు పైనే.. దీంతో.. మిగతా 13వేల టిక్కెట్లు ఏమయ్యాయి? అనేదానిపై అజారుద్దీన్ క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై గందరగోళం నెలకొంది. కాంప్లిమెంటరీగా ఎవరికైనా ఇచ్చారా? ఎక్కడ అమ్ముడుపోయాయి? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు అజారుద్దీన్.

మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ కోసం భారత్ టూర్ కు వచ్చిన ఆస్ట్రేలియా.. ఒక మ్యాచ్ హైదరాబాద్ లో ఆడనుంది. ఈ నెల 25న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ లో చాలారోజుల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో మ్యాచ్ ని లైవ్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా ఉన్నారు. టిక్కెట్లు దక్కించుకునేందకు నగరవాసులు పోటీపడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం కలకలం రేపింది.