Weather Forecast : తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు

ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

Weather Forecast : తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు

Weather update

Telangana Weather Forecast : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు చలి గజగజ వణికిస్తే..ఇప్పుడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల శనివారం సాయంత్రం వర్షం కురిసింది. సెలవులు కావడంతో రోడ్లపై రద్దీ అంతగా లేకపోవడంతో…ట్రాఫిక్ ఎక్కడా జాం కాలేదు. తాజాగా..మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉంటుందో వెల్లడించింది.

Read More : Viral Video: పద్దతిగా ర్యాంపుపై నుంచి నడుచుకుంటూ కాలువ దాటిన ఏనుగుల గుంపు

తూర్పు / ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నవి కాబట్టి…తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 2021, జనవరి 17వ తేదీ సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

Read More : Komaki Ranger: భారత్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్.. నేడే విడుదల!

మరోవైపు…ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. నల్లగొండ, సూర్యాపేట, నార్కట్ పల్లి, నూతనకల్, కట్టంగూర్, ఆత్మకూరు, కేతేపల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు చోట్ల ఇళ్లలోకి నీరు వచ్చింది. నకిరేకల్ మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి తాటికల్ గ్రామ శివారులో వాగు ఉప్పొంగుతోంది. దీంతో నల్లగొండ – నకిరేకల్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు వరదల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కూలీలను స్థానికుల కాపాడారు.