Hyderabad Traffic Police : పోలీసు శాఖలో కరోనా కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలే కారణమా ?

పోలీస్ శాఖలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ కేసుల తనిఖీ చేస్తున్న సిబ్బంది ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారు.

Hyderabad Traffic Police : పోలీసు శాఖలో కరోనా కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలే  కారణమా ?

Drunk

Drunk And Drive : పోలీస్ శాఖలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ కేసుల తనిఖీ చేస్తున్న సిబ్బంది ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారు. మందు బాబుల కిక్ దింపుతున్న పోలీసులు ఇప్పుడు హడలిపోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు పోలీసులు జంకుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనా కేసులు నమోదు కావడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ డ్యూటీ చేయాలంటే భయపడుతున్నారు. ఉన్నతాధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ లపై నిర్ణయం తీసుకోవాలని కింది స్థాయి సిబ్బంది కోరుతున్నారు.

మొదటి సారి కరోనా వచ్చినప్పుడు దాదాపు 50 మంది పోలీసులు కరోనాతో మృతి చెందారు..ఈ సారి కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు కొన్ని రోజులు నిలిపి వేయాలని సూచిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలతో కరోనా సోకుతున్నట్టు ఆందోళన చెందుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ డ్యూటీలో ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసి మోతాదు కంటే ఎక్కువ మద్యం సేవించిన వారి పై కేసులు నమోదు చేస్తారు..మొత్తం మూడు కమిషనరేట్ పరిధిలో 100 డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు..రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు తనిఖీలు చేస్తారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో వాహనదారుల నోట్లో బ్రీత్ ఎనలైజర్ మిషన్ పెట్టి వారితో ఇంటరాక్ట్‌ అవుతున్నారు. అటువంటి సందర్భాల్లో కరోనా విపరీతంగా వ్యాపిస్తోందని కింది స్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిలిపివేయాలని కోరుతున్నారు. గత ఏడాది కరోనా సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read More : IPL 2021 – Ms Dhoni: సీఎస్కే కెప్టెన్‌గా ధోనీకి 200వ మ్యాచ్.. తర్వాత నిషేదం తప్పదా!!