Hyderabad : వనస్థలిపురం బ్యాంక్ చోరీలో ట్విస్ట్..బెట్టింగ్ లో డబ్బులొస్తే వస్తా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ క్యాషియర్ మెజేస్

హైదరాబాద్ లోని వనస్థలిపురం బ్యాంకులో చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే ఈ చోరీకి కారణమని తేలింది. స్వయంగా తాను పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు క్యాషియర్ ప్రవీణ్ కుమార్. బ్యాంకు సొమ్మును ఇష్టా రాజ్యంగా వాడేసుకున్నాడు. బ్యాంకులో సొమ్మును క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు. పైగా బెట్టింగ్ లో తనకు డబ్బులు వస్తే తిరిగి డబ్బుతో తిరిగి వస్తాను. లేదంటే ఛస్తాను అంటూ బ్యాంకు మేనేజర్ కు మెజేస్ చేశాడు.

Hyderabad : వనస్థలిపురం బ్యాంక్ చోరీలో ట్విస్ట్..బెట్టింగ్ లో డబ్బులొస్తే వస్తా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ క్యాషియర్ మెజేస్

Vanasthalipuram Bank Of Baroda Cashier Theft Bank Cash For Cricket Betting

Hyderabad Cashier Theft Bank Cash: హైదరాబాద్ లోని వనస్థలిపురం బ్యాంకులో చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే ఈ చోరీకి కారణమని తేలింది. స్వయంగా తాను పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు క్యాషియర్ ప్రవీణ్ కుమార్. బ్యాంకు సొమ్మును ఇష్టా రాజ్యంగా వాడేసుకున్నాడు. బ్యాంకులో సొమ్మును క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు. పైగా బెట్టింగ్ లో తనకు డబ్బులు వస్తే తిరిగి డబ్బుతో తిరిగి వస్తాను. లేదంటే ఛస్తాను అంటూ బ్యాంకు మేనేజర్ కు మెజేస్ చేశాడు. క్రికెట్ లో బెట్టింగ్ కట్టి నష్టపోయిన బ్యాంకు క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పనిచేసే బ్యాంకులో రూ.22.53 లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు. పైగా బెట్టింగ్ లో పెట్టిన సొమ్ము తిరిగి వస్తే బ్యాంకునుంచి పట్టుకెళ్లిన డబ్బును తిరిగి ఇచ్చేస్తానని లేదంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అంటూ మేనేజర్ కు మెసేజ్ చేయటంతో ఈచోరీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

Also read : Zero Covid policy: డబ్ల్యూహెచ్ఓ పై మండిపడ్డ చైనా.. వారికి సలహాలివ్వడం నచ్చదట..

ఈ కేసు వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ లోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్యాషియర్ బ్యాంక్ నగదుతో పరారైన కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. పరారైన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నారు. అయితే ఈ చోరీకి కారణం క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే ఇందుకు కారణమని తెలిసింది.బెట్టింగ్ లో భారీగా డబ్బులు లాసైన క్యాషియర్ ప్రవీణ్ కుమార్.. బ్యాంక్ నగదు తీసుకుని పరారయ్యాడు. తాజాగా డబ్బులు తీసుకెళ్లిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ బ్యాంకు మేనేజర్ మెసేజ్ చేశాడు. బెట్టింగ్ లో భారీగా నష్టపోయనని, ఇప్పుడు తీసుకెళ్లిన డబ్బుతో మరోసారు బెట్టింగ్ పెట్టానని చెప్పాడు. బెట్టింగ్ లో తనకు వస్తే తిరిగి ఇస్తానని, లేకపోతే సూసైడ్ చేసుకుంటానని మెజేస్ చేశాడు.

Also read : అప్పులమీద కేంద్రం పెత్తనంపై.. టీఆర్ఎస్ ఆగ్రహం

కాగా..వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు రోజుల క్రితం డబ్బు మాయమైంది. 22 లక్షల 53 వేల రూపాయల నగదు తీసుకుని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పరారయ్యాడు. రోజులాగే డ్యూటికి వచ్చాడు ప్రవీణ్ కుమార్. కొంతసేపటి తర్వాత తనకు కడుపునొప్పి వస్తుందని మేనేజర్ కు చెప్పాడు. టాబ్లెట్స్ తెచ్చుకుంటానని బయటికి వెళ్లాడు. తర్వాత తిరిగి బ్యాంక్ కు రాలేదు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో బ్యాంక్ క్లోజ్ చేసి సమయంలో మేనేజర్ అకౌంట్స్ చెక్ చేశాడు. నగదులో 23 లక్షలు తక్కువ వచ్చినట్టు తేలింది. దీంతో క్యాషియర్ కి మేనేజర్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రవీణ్ కుమార్ స్పందించక పోవడంతో.. బ్యాంక్ చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మేనేజర్ కు క్యాషియర్ ప్రవీణ్ కుమార్ చేసిన మెసేజ్ విషయం వెలుగులోకి వచ్చింది.