Hyderabad : కౌన్ బనేగా కరోడ్ పతిలో ఫ్రైజ్ మనీ వచ్చిందని ఫోన్…తర్వాత

చింతల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళకు సైబర్ కేటుగాళ్లు గాలం వేశారు. కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ. 25 లక్షలు గెలుచుకున్నారంటూ...ఫోన్ చేశారు.

Hyderabad : కౌన్ బనేగా కరోడ్ పతిలో ఫ్రైజ్ మనీ వచ్చిందని ఫోన్…తర్వాత

Cyberabad

Cyber Fraud : లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని..ఇతరులకు సమాచారాన్ని లీక్ చేయవద్దని ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని, ఈ లింక్ ను క్లిక్ చేయాలంటూ వచ్చిన మెసేజ్ లు చూసి చాలా మంది మోసపోతున్నారు. ఫ్రైజ్ వచ్చిందని..ఇందుకు కొన్ని వివరాలు చెబితే సరిపోతుందంటూ..కేటుగాళ్లు మోసగిస్తున్నారు.

Read More : PUBG : బుద్ధిగా చదువుకుంటారని స్మార్ట్ ఫోన్ ఇస్తే.. పిల్లలు చేసిన పనికి తల్లి షాక్

ఇలా చాలా మంది లక్షల రూపాయలు మోసపోయారు. చివరకు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని సైబర్ క్రైం సెల్ ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో కూడా ఇలాంటి సైబర్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా..మరో ఘటన చోటు చేసుకుంది. చింతల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళకు సైబర్ కేటుగాళ్లు గాలం వేశారు. కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ. 25 లక్షలు గెలుచుకున్నారంటూ…ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాల్ తీసుకున్న సదరు మహిళ…వారి వేసిన గాలంలో పడిపోయారు. ఫ్రైజ్ మనీ పంపించేందుకు మాత్రం ఛార్జీలు చెల్లించాలని చెప్పారు. డబ్బులు ఎలా పంపించాలో కూడా వారు చెప్పారు.

Read More : Enemy : ‘నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే.. ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు’..

ఇది నమ్మిన మహిళ..విడతల వారీగా రూ. 8 లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అయితే..కాలం గడిచిపోయింది. అవతలి నుంచి మరోసారి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. వారు చెప్పిన ఫ్రైజ్ మనీ కూడా రాలేదు. దీంతో తాను మోసపోయానని తలబాదుకుంది. చివరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ..ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇలాంటి విషయాలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.