Matrimony: మ్యాట్రిమోని మోసం.. రూ.9 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ యువతి

మ్యాట్రిమోనిలో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి మోసపోయారు. పెళ్లి కొడుకు కావాలని భారత్ మ్యాట్రిమోనిలో తన వివరాలు నమోదు చేసుకుంది. ఆ మహిళను ట్రాప్ చేశాడు సైబర్ కేటుగాడు.. సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మారేడ్ పల్లికి చెందిన అనితా రాజ్ అనే యువతి వరుడికోసం భారత్‌ మాట్రిమోని సంస్థలో వివరాలు నమోదు చేసుకుంది.

Matrimony: మ్యాట్రిమోని మోసం.. రూ.9 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ యువతి

Matrimony

Matrimony: మ్యాట్రిమోనిలో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి మోసపోయారు. పెళ్లి కొడుకు కావాలని భారత్ మ్యాట్రిమోనిలో తన వివరాలు నమోదు చేసుకుంది. ఆ మహిళను ట్రాప్ చేశాడు సైబర్ కేటుగాడు.. సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మారేడ్ పల్లికి చెందిన అనితా రాజ్ అనే యువతి వరుడికోసం భారత్‌ మాట్రిమోని సంస్థలో వివరాలు నమోదు చేసుకుంది.

ఆమె వివరాలు సేకరించిన సైబర్ కేటుగాడు ఇటీవల అనితారాజ్ కు ఫోన్ చేశాడు. తన పేరు బక్షి క్లిఫర్డ్‌ గా పరిచయం చేసుకున్నాడు. తాము ఇండియా నుంచి వ్యాపార నిమిత్తం స్కాట్లాండ్‌ వచ్చి ఇక్కడే స్థిరపడ్డామని తెలిపాడు. ఆలా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన పెట్టాడు. తన వ్యాపారం, సంపాదన గురించి అనితకు వివరించాడు.

వేరే వ్యక్తి ఫోటో పంపాడు. ఆస్తి, అందం అన్ని ఉండటంతో అనితా బక్షి క్లిఫర్డ్‌ ప్రతిపాదనను అంగీకరించింది. ఇక అనితా రాజ్ ను ట్రాప్ లో పెట్టి ప్రేమగా నటించడం మొదలు పెట్టాడు. తన కోసం మంచి గిఫ్ట్ పంపుతున్నానని ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులం అంటూ గొంతు మార్చి వేరే ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ చేసి మూడు దఫాలుగా మొత్తం రూ.తొమ్మిది లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు.

తర్వాత ఫోన్‌ స్విచ్‌ఆఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి శనివారం ఆన్‌లైన్‌ ద్వారా సైబర్‌ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేసింది. కాగా ఇటువంటి మోసాలు అనేకం జరుగుతున్నాయి.. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా సైబర్ కేటుగాళ్లు చేతుల్లో కొందరు మోసపోతూనే ఉన్నారు.