Hyderabadis : వాలని కనురెప్ప, ఫోన్లు చూస్తూనే నిద్ర..వాటితోనే గడిపేస్తున్నారంట

ఉదయం లేచింది మొదలు..రాత్రి పక్కలోకి చేరుకొనే వరకు..సెల్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. నిద్రను సెల్ ఫోన్ శాసిస్తోంది. దీంతో కొంతమందిలో అనారోగ సమస్యలు ఏర్పడుతున్నాయి.

Hyderabadis : వాలని కనురెప్ప, ఫోన్లు చూస్తూనే నిద్ర..వాటితోనే గడిపేస్తున్నారంట

Sleeping

Wakefit.co’s report : నిద్ర. మనిషికి నిద్ర ఎంతో అవసరం. 24 గంటల్లో కనీసం 8 గంటలు ఖచ్చితంగా నిద్ర పోవాల్సిందేనని చెబుతున్నా..కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు..రాత్రి పక్కలోకి చేరుకొనే వరకు..సెల్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. నిద్రను సెల్ ఫోన్ శాసిస్తోంది. దీంతో కొంతమందిలో అనారోగ సమస్యలు ఏర్పడుతున్నాయి. మొబైల్ కు దూరంగా ఉంటేనే..నిద్ర బాగా పడుతుందని కొంతమంది వెల్లడిస్తున్నారు. రోజులో అధిక సమయం దాంతోనే టైం పాస్ చేస్తున్నారు. ఈ విషయం…వేక్ ఫిట్.కో అధ్యయనం (ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డు – 2020-21)లో వెల్లడించింది. దేశంలో నిద్ర అలవాట్లపై 4వ అతిపెద్ద అధ్యయనం.

సర్వే ఎలా జరిగింది : –
దేశ వ్యాప్తంగా 16 వేల మందిపై అధ్యయనం సాగింది. వారి అభిప్రాయాలను సేకరించింది. గత ఏడాది జరిపిన ఇదే తరహాలో…హైదరాబాదీలు 91 శాతం నిద్రకు ముందు మొబైల్ వినియోగిస్తున్నారని వెల్లడించింది. ఈ ఏడాది అది 94 శాతం నమోదైందని, హైదరాబాద్ లో జరిపిన అధ్యయనం ప్రకారం..80 శాతం మంది తాము పని చేస్తున్న సమయంలో వారంలో ఒకటి నుంచి మూడు రోజులు నిద్ర కరువై మగతగా ఉంటున్నట్లు తెలియచేయడం జరిగిందని సర్వే నివేదిక తెలిపింది. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లలో అర్ధరాత్రి వరకు సినిమాలు చూస్తున్న వారి శాతం 26గా ఉందని, 40 శాతం మంది వెన్ను సమస్యలతో బాధ పడుతున్నట్లు వివరించింది.

ఇక 40 శాతం మంది వెన్ను సమస్యలతో బాధ పడుతున్నట్లు, 90 శాతం మంది రాత్రిళ్లు ఒకసారి లేదా రెండుసార్లు మొబైల్ చూడటానికి మేల్కొంటున్నట్లు తెలిపింది. మరో మంచి సుఖవంతమైన పరుపులు మంచి నిద్రకు ఉపక్రమింపచేస్తాయని 38 శాతం మంది తెలియచేసినట్లు, 32 శాతం మంది మొబైల్ కు దూరంగా ఉంటే..నిద్ర బాగా పడుతుందని, సరియైన నిద్ర అలవాట్లను పాటించడం మూలంగా..అంతా బాగుందని 28 శాతం వెల్లడించినట్లు సర్వే నివేదిక తెలిపింది.