Numaish: నాంపల్లి ఎగ్జిబిషన్ నేడే ప్రారంభం.. 46 రోజులపాటు సాగనున్న నుమాయిష్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ నుమాయిష్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నుమాయిష్‌లో 1500 మంది ప్రదర్శనదారులు, 2,400 స్టాల్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ కొనసాగుతుంది.

Numaish: నాంపల్లి ఎగ్జిబిషన్ నేడే ప్రారంభం.. 46 రోజులపాటు సాగనున్న నుమాయిష్

Numaish: హైదరాబాద్‌తోపాటు తెలంగాణకే ప్రతిష్టాత్మకంగా నిలిచే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఆదివారం (జనవరి 1) ప్రారంభం కానుంది. నేటి నుంచి 46 రోజులపాటు, అంటే ఫిబ్రవరి 15 వరకు ఈ నుమాయిష్ జరుగుతుంది. ఇది 83వ నుమాయిష్ (అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన) కావడం విశేషం.

North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్

తెలంగాణ మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి ఈ నుమాయిష్ ప్రారంభిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ నుమాయిష్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నుమాయిష్‌లో 1500 మంది ప్రదర్శనదారులు, 2,400 స్టాల్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ కొనసాగుతుంది. పెద్దలకు ఎంట్రీ ఫీజు రూ.40. ఐదేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. నుమాయిష్‌కు వచ్చే ప్రజల కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే వైద్య శిబిరాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నుమాయిష్‌కు సరైన ఆదరణ దక్కలేదు. అయితే, ప్రస్తుతం కరోనా తీవ్రత అంతగా కనిపించకపోవడంతో ఈసారి నుమాయిష్ విజయవంతమవుతుందని నిర్వాహకులు, వ్యాపారులు భావిస్తున్నారు.

Inidan Railways Amrit Bharat scheme : చిన్న రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

ఈ సారి దాదాపు 22 లక్షల మంది నుమాయిష్ సందర్శనకు వస్తారని నిర్వాహకుల అంచనా. నుమాయిష్ కోసం స్టాళ్ల కేటాయింపు, ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గతంలో అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో, ఈ సారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేసి ఉంచారు. నుమాయిష్ నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అనేక మార్గాల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు. అలాగే నుమాయిష్ కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నగర పరిధిలోని 25 డిపోల నుంచి అదనపు బస్సుల్ని నడపనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. సెలవు రోజుల్లో దాదాపు 218 బస్సులను నడపాలని నిర్ణయించారు.