Komatireddy venkat reddy: రేపటి రేవంత్ ప్రోగ్రాంకు నేను హాజరుకాను.. నా నియోజకవర్గంలో..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ, తెలంగాణ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాగార్జున సాగర్ లో రేపటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని అన్నారు. నా సొంత నియోజకవర్గంలో..

Komatireddy venkat reddy: రేపటి రేవంత్ ప్రోగ్రాంకు నేను హాజరుకాను.. నా నియోజకవర్గంలో..

Venkat Reddy

Komatireddy venkat reddy: కాంగ్రెస్ పార్టీ ఎంపీ, తెలంగాణ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాగార్జున సాగర్ లో రేపటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని అన్నారు. నా సొంత నియోజకవర్గంలో కేంద్ర మంత్రి గడ్కరీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండటం వల్ల నేను రేవంత్ కార్యక్రమానికి హాజరుకావటంలేదని తెలిపారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా ఉందని, వేరే నేత వచ్చి సమీక్ష చేయాల్సిన అవసరం లేదంటూ, కాంగ్రెస్ పార్టీ బలంగా లేని నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో మీటింగ్ పెడితే బాగుంటుందని అన్నారు. నేను ఆ రెండు జిల్లాల్లో మీటింగ్ లు పెడతానని తెలిపారు. వరంగల్ లో రాహుల్ సభ విజయవంతం అవుతుందని అన్నారు. పార్టీ బలోపేతం కోసం భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేయాలని, సీఎల్పీ నేతగా రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి, పార్టీని అధికారంలోకి తెచ్చారని, భట్టి పాదయాత్ర చేస్తే మేము సపోర్ట్ చేస్తామని వెంకటరెడ్డి అన్నారు.

Komatireddy : దటీజ్ కాంగ్రెస్..ఒకే వేదికపై రేవంత్ – కోమటిరెడ్డి..సరదాగా మాట్లాడుకున్నారు

పీకే గురించి కాదని, కేసీఆర్ ని ఎలా పీకాలన్నదే మా టార్గెట్ అంటూ కోమటిరెడ్డి తెలిపారు. ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి ఎత్తివేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏం అభివృద్ధి చేశాడని దేశం గురించి కేసీఆర్ మాట్లాడుతున్నాడంటూ విమర్శించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ తో పొత్తు అడిగినా ఏఐసీసీ హైకమాండ్ ఒప్పుకోలేదన్నారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సర్వసాధారణం అంటూ వెంకట్ రెడ్డి అన్నారు.

Komatireddy RajGopal Reddy: కాంగ్రెస్ సభ్యులెవరు నాకు మద్దతు ఇవ్వలేదు: రాజగోపాల్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వృథా చేశారంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు. 70శాతం గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదని, రైతులు ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మణవెల్లం ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఏడేళ్ల నుండి సీఎ కేసీఆర్ కాలయాపన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 98శాతం ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తయిందని, 50 కోట్లు నిధులు మంజూరు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందని, తక్షణమే నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నాపై కక్షతోనే ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని, కమీషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించారంటూ కేసీఆర్ పై వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.