KA Paul : నేను అధికారంలోకి వస్తే.. తెలంగాణలో ప్రతి గ్రామానికి సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తా : కే.ఏ పాల్

పార్టీలోకి వస్తే రెండు జిల్లాల్లో గెలిపించే బాధ్యత తనదని చెప్పానని, ఆయన ఆలోచిస్తానని చెప్పాడని తెలిపారు.

KA Paul : నేను అధికారంలోకి వస్తే.. తెలంగాణలో ప్రతి గ్రామానికి సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తా : కే.ఏ పాల్

KA Paul (2)

KA PaulPress Meet : పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరాలని చూస్తున్నారు.. కాకపోతే బీజేపీలో గెలవను అనుకుని ఆగుతున్నాడని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు తకే.ఏ పాల్ అన్నారు. గెలవడానికి బయటకు వచ్చావా లేక ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చావా అని ప్రశ్నించారు. ఈ మేరకు కే.ఏ పాల్ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న (శుక్రవారం) జరిగిన రైలు ప్రమాదానికి మోదీ కారణం కాదా అని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు అన్ని చారిటీలు ఆపేశారని అయినా వారి మీద కేసులు వేశాను, నోటీసులు పంపించానని తెలిపారు. కుటుంబ పాలన, కుల పాలన, డబ్బు పాలన వలన అర్హులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని పేర్కొన్నారు.

KA Paul: నేను ప్యాకేజ్ స్టార్‌ని కాదు.. అందుకే ఆ పని చేయలేదు: కేఏ పాల్

తాను అధికారంలోకి వస్తే తెలంగాణలోని ప్రతి గ్రామానికి సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తానని, ప్రతి సర్పంచ్ కు 20వేల రూపాయల జీతం ఇస్తానని చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. పార్టీలోకి వస్తే రెండు జిల్లాల్లో గెలిపించే బాధ్యత తనదని చెప్పానని, ఆయన ఆలోచిస్తానని చెప్పాడని తెలిపారు.