Hyderabad Rains : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతవరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడుపల్లి , బేగంపేట్ , రాణిగంజ్, ప్యారడైస్, చిలుకలగూడ, చింతల్, శాపూర్ నగర్, గాజుల రామారాం, తో సహా పలు ప్రాంతాలలో వర్షం కురవటంతో  ఎండలతో అల్లాడుతున్న  ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

Hyderabad Rains : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

Hyderabad Rains

Hyderabad Rains :  హైదరాబాద్ లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతవరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడుపల్లి , బేగంపేట్ , రాణిగంజ్, ప్యారడైస్, చిలుకలగూడ, చింతల్, శాపూర్ నగర్, గాజుల రామారాం, తో సహా పలు ప్రాంతాలలో వర్షం కురవటంతో  ఎండలతో అల్లాడుతున్న  ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

సెక్రటేరియట్, లక్డ్డికాపుల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవటంతో జీహెచ్ ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో ఈరాత్రిలోగా మరికొన్నిప్రాంతాల్లో ఈదురు గాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

జీహెచ్ఎంసీ అధికారులు డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. నగరంలో ఎక్కడైనా ఈదురు గాలులకు చెట్లు పడిపోయి ఇబ్బందులు ఏర్పడితే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.

ఈ రోజు రాత్రికి  వికారాబాద్,సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్,మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్ ,భువనగిరి,నారాయణ్ పేట్ ,జనగాంలలో ఓ మోస్తరుగా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read : Shigella Bacteria : కేరళలో మరోసారి వెలుగు చూసిన షిగెల్లా బ్యాక్టీరియా కేసు