Secunderabad: అగ్నిప్రమాద ఘటనలో ఇంకా లభించని ఇద్దరి ఆచూకీ.. మూడోరోజు ముగిసిన రెస్క్యూ ఆపరేషన్

ఇప్పటికి ఒక్కరికి సంబంధించిన ఎముకలు, ఇతర అవశేషాలు మాత్రమే దొరికిన సంగతి తెలిసిందే. వీటిని క్లూస్ టీమ్ సేకరించి, డీఎన్ఏ టెస్టు కోసం పంపింది. ఈ ఘటనలో కనిపించకుండా పోయిన మిగతా ఇద్దరికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు.

Secunderabad: అగ్నిప్రమాద ఘటనలో ఇంకా లభించని ఇద్దరి ఆచూకీ.. మూడోరోజు ముగిసిన రెస్క్యూ ఆపరేషన్

Secunderabad: సికింద్రాబాద్, రాంగోపాల్ పేటలో అగ్ని ప్రమాదానికి గురైన బిల్డింగులో మూడోరోజు రెస్క్యూ ఆపరేషన్ పూర్తైంది. డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది బుధవారం బిల్డింగులోకి వెళ్లి భవనాన్ని పరిశీలించారు. కనిపించకుండా పోయిన ముగ్గురికి సంబంధించిన ఆనవాళ్లేమైనా దొరుకుతాయా అని వెతికారు.

Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

ఇప్పటికి ఒక్కరికి సంబంధించిన ఎముకలు, ఇతర అవశేషాలు మాత్రమే దొరికిన సంగతి తెలిసిందే. వీటిని క్లూస్ టీమ్ సేకరించి, డీఎన్ఏ టెస్టు కోసం పంపింది. ఈ ఘటనలో కనిపించకుండా పోయిన మిగతా ఇద్దరికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అగ్ని ప్రమాదం వల్ల భవనం ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో బిల్డింగ్ సమీపంలోకి అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చని, బిల్డింగ్ దగ్గరికి ఎవరూ వెళ్లొద్దని సూచిస్తూ అధికారులు బిల్డింగ్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. భవనం ఇంకా కాస్త వేడిగానే ఉంది.

Hyderabad: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. సిలిండర్లు పేలి అంటుకున్న మంటలు

భవనం లోపల కాలిపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలగించిన తర్వాత భవన పటిష్టతను అధికారులు పరిశీలిస్తారు. భవనం ఎలా ఉందో నివేదిక రూపొందిస్తారు. ఈ నివేదిక ఆధారంగా భవనాన్ని కూల్చే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఈ బిల్డింగ్ వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బిల్డింగ్ వద్ద భద్రత ఏర్పాటు చేశారు.