Hyderabad: హైదరాబాద్ రూ.10కే వైద్యం అందిస్తున్న ప్రైవేట్ డాక్టర్ | In Hyderabad 10rs doctor for poor people

Hyderabad: హైదరాబాద్ రూ.10కే వైద్యం అందిస్తున్న ప్రైవేట్ డాక్టర్

పేదవారికి వైద్యం అందించేందుకు ప్రైవేట్ డాక్టర్ ముందుకొచ్చారు. డాక్టర్ రోస్ లైన్ కేవలం రూ.10కే వైద్యం అందించేందుకు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా నేరేడ్‌మెట్ లోని అంబేద్కర్ భవన్ లో...

Hyderabad: హైదరాబాద్ రూ.10కే వైద్యం అందిస్తున్న ప్రైవేట్ డాక్టర్

Hyderabad: పేదవారికి వైద్యం అందించేందుకు ప్రైవేట్ డాక్టర్ ముందుకొచ్చారు. డాక్టర్ రోస్ లైన్ కేవలం రూ.10కే వైద్యం అందించేందుకు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా నేరేడ్‌మెట్ లోని అంబేద్కర్ భవన్ లో క్లినిక్ ఏర్పాటు చేశారు.

‘పేషెంట్లకు ట్రీట్ చేయడం నాకు ఇష్టం. నేను పుట్టి పెరిగిన చోటే పేదలకు సాయం చేసేందుకు రూ.10కే వైద్యం అందించాలనుకుంటున్నా. రోజుకు సుమారు 15 మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నా. ల్యాబ్ అవసరాల్లోనూ 50శాతం రాయితీ ఇస్తున్నా’ అని డాక్టర్ రోస్ చెప్పారు.

ఆర్గనైజర్ గోపాల్ మాట్లాడుతూ.. ’30ఏళ్లుగా మెడికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా. పేదల కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు డా. రోస్ రూ.10కే వైద్యం ఐడియాతో ముందుకొచ్చారు. ఇదొక మంచి ఆరంభం అని అనుకుని మొదలుపెట్టాం. ప్రజలకు సేవ చేయడం నాకు చాలా ముఖ్యం’ అని వెల్లడించారు.

ఇది కూడా చదవండి : మార్కెట్లోకి మరో కొత్త ఓటీటీ

చాలా మంది పేషెంట్లు రూ.200, రూ.300వెచ్చించి డాక్టర్ల దగ్గరకు వెళ్తే మందులకు డబ్బులు సరిపోవు. రూ.10కే ట్రీట్మెంట్ అందించడం వల్ల వారి మందులు వారే కొనుగోలు చేసుకుంటారు. అదే అసలు ఈ క్లినిక్ వెనుక ఉన్న ఆలోచన. ఇంకా ఈ క్లినిక్ విస్తరించాలని కూడా అనుకుంటున్నారట. గైనకాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ సేవలు కూడా అందించాలనే యోచనలో ఉన్నారు డా.రోస్.

×