Petrol Payment: రూ.200 పెట్రోల్ కొట్టించుకుని టూ వీలర్‌పై పరారీ

మెహిదీపట్నంలోని ఫ్యూయెల్ స్టేషన్ నుంచి ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ కొట్టించుకుని పరారయ్యారు. శనివారం రేతిబౌలీ రోడ్‌లో ఉన్న పెట్రోల్ బంక్ కు పల్సర్ బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఫేస్ మాస్కులు ధరించి ఉన్నవారిద్దరూ.. రూ.200విలువ చేసే ఫ్యూయెల్ కావాలని వర్కర్ మునీర్ ను అడిగారు.

10TV Telugu News

Petrol Payment: మెహిదీపట్నంలోని ఫ్యూయెల్ స్టేషన్ నుంచి ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ కొట్టించుకుని పరారయ్యారు. శనివారం రేతిబౌలీ రోడ్‌లో ఉన్న పెట్రోల్ బంక్ కు పల్సర్ బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఫేస్ మాస్కులు ధరించి ఉన్నవారిద్దరూ.. రూ.200విలువ చేసే ఫ్యూయెల్ కావాలని వర్కర్ మునీర్ ను అడిగారు.

‘పెట్రోల్ ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఈ వాలెట్ ద్వారా పే చేయడం కుదురుతుందా.. అని అడిగారు. మెషీన్ తీసుకుని వచ్చేలోపే బైక్ మీదున్న వ్యక్తి యాక్సిలరేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. వారిద్దరిలో ఒక వ్యక్తిని పట్టుకునేలోపే పరుగుతీశారు’ అంటూ ఆ స్టేషన్ లో పనిచేసే వ్యక్తి తెలిపాడు.

అటుగా రోడ్ పై వెళ్తున్న పాట్రోలింగ్ వెహికల్ ఘటనను గమనించి స్టేషన్ లోకి వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.

సోమవారం హైదరాబాద్ లో పెట్రోల్ రేట్ రూ.105.83గా ఉంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత 16 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.84, డీజిల్‌ ధర రూ. 89.87గా ఉంది.

10TV Telugu News