TS Covid-19 Cases : తెలంగాణలో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు.. ఆగని మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది కరోనాతో మరణించారు.

TS Covid-19 Cases : తెలంగాణలో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు.. ఆగని మరణాలు

In Telangana Covid Cases Go Up To 2493 15 More Died With Rise In Testing

TS Covid-19 Cases : తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది కరోనాతో మరణించారు.

రాష్ట్రంలో మొత్తంగా 94,189 కరోనా శాంపిల్స్ నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,493 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,844కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 3,296కి చేరింది. గడచిన 24గంటల్లో కరోనా నుంచి 3,308 మంది రికవరీ అయ్యారు.

ఇప్పటివరకూ 5,44,294 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 33,254 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 318 కరోనా కేసులు నమోదయ్యాయి.