Corona Cases : తెలంగాణ‌లో కొత్త‌గా 403 కరోనా కేసులు

ప్రజలందరూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని, ర‌ద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాల‌ని ఆదేశించారు. ప‌దేండ్ల లోపు పిల్ల‌లు, 60 ఏండ్లు పైబ‌డిన వృద్ధులు అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని సూచించారు.

Corona Cases : తెలంగాణ‌లో కొత్త‌గా 403 కరోనా కేసులు

Corona (2)

corona cases : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 403 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ డా.జి.శ్రీనివాస్ రావు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప్రజలందరూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని, ర‌ద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాల‌ని ఆదేశించారు. ప‌దేండ్ల లోపు పిల్ల‌లు, 60 ఏండ్లు పైబ‌డిన వృద్ధులు అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని సూచించారు. ఇక మిగ‌తా వ‌య‌సు గ‌ల వ్య‌క్తులు.. వివిధ ప‌నుల నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాస్కు ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

Covid cases: కొంచెం ఊరట.. దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు..

అవ‌స‌ర‌మైతేనే ప్ర‌యాణాలు చేయాల‌ని, లేని ప‌క్షంలో ఇంటికే ప‌రిమితం కావాల‌న్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారు త‌క్ష‌ణ‌మే ఆరోగ్య శాఖ అధికారుల‌ను సంప్ర‌దించి, మందులు వాడాల‌ని సూచించారు. దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు ప్ర‌యాణాలు చేయక‌పోవ‌డం మంచిద‌న్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌న్నారు.