61దేశాలతో కలిసి…WHOపై నిష్పాక్షిక దర్యాప్తుకు భారత్ ఓకే

  • Published By: venkaiahnaidu ,Published On : May 18, 2020 / 06:26 AM IST
61దేశాలతో కలిసి…WHOపై నిష్పాక్షిక దర్యాప్తుకు భారత్ ఓకే

కోవిడ్-19 మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)తీరుపై ప్రపంచంలోని చాలా దేశాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో కరోనా విజృంభణ ఉన్న విషయం తెలిసినప్పటికీ మిగిలిన దేశాలను WHO అలర్ట్ చేయలేదని పలు దేశాలు విమర్శిస్తున్నాయి. వైరస్ గురించి సమాచారముండి కూడా ముందుగా హెచ్చరికలు చేయలేదని డబ్యూహెచ్ వోపై  విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా ప్రపంచఆరోగ్య సంస్థకు నిధులు ఆపేశాడు.

కోవిడ్ -19విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను చైనా బెదిరించినట్టు కూడా అమెరికా నిఘా సంస్థ.. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA) తన లేటెస్ట్ రిపోర్ట్ లో తెలిపింది. WHOని  జనవరిలో డ్రాగన్ దేశం బెదిరించినట్టు తెలిపింది. WHOని చైనా బెదిరించినట్టు ఆరోపిస్తూ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక వెల్లడించడం ఇది రెండోది. తొలిసారి జర్మనీ నిఘా సంస్థ డెర్‌ స్పైగల్ కూడా తన నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌పై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. కాగా, వైరస్‌ విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించామని డబ్ల్యూహెచ్‌వో చెప్పుకొస్తోంది.

ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభంలో డ‌బ్ల్యూహెచ్‌వోపై స్పందనపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని అమెరికా సహా పలు ప్ర‌పంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే 62 దేశాలు ఓ ముసాయిదా తీర్మాణాన్నిప్రతిపాదించాయి. ఇవాళ(మే-18,2020) ప్రారంభం అయ్యే 73వ WHA(వరల్డ్ హెల్త్ అసెంబ్లీ)మీటింగ్ లో…ఆరోగ్య సంస్థ పాత్ర‌ను ప్ర‌శ్నించ‌నున్నారు. 

WHOపై నిష్పక్షపాత దర్యాప్తుకు భారత్ మద్దతు

అయితే ఇప్పుడు భార‌త్ కూడా ఆ కూట‌మి దేశాల డిమాండ్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ది. WHOపై నిష్ప‌క్ష‌పాతంగా, వ్య‌క్తిగ‌తంగా ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఆస్ట్రేలియా, యురోపియ‌న్ యూనియ‌న్ డిమాండ్ చేసింది. ఈ దేశాల‌కు భార‌త్ కూడా మ‌ద్ద‌తుగా నిలిచింది. క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నిష్ప‌క్ష‌పాతంగా, వ్య‌క్తిగ‌తంగా, స‌మ‌గ్రంగా, ప్ర‌స్తుతం ఉన్న విధానాల‌కు అనుకూలంగా కోవిడ్-19 మ‌హ‌మ్మారి అంశంలో WHO పాత్ర‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ముసాయిదాలో తెలిపారు. జ‌పాన్‌, బ్రిట‌న్‌, న్యూజిలాండ్‌, ద‌క్షిణ కొరియా, బ్రెజిల్‌, కెన‌డా వంటి దేశాలు కూడా ముసాయిదాకు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. 

WHOపై ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేప‌ట్టాల‌ని గ‌త నెల‌లో మొదట ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది.  రాబోయే మ‌హ‌మ్మారుల‌ను అడ్డుకోవాలంటే డ‌బ్ల్యూహెచ్‌వోతో క‌లిసి ప‌నిచేయాల‌ని, కానీ దానికి ముందు ఆ సంస్థ పాత్ర‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిసే పెయిన్ తెలిపారు. కానీ 62 దేశాలు తయారు చేసిన ముసాయిదాలో ఎక్క‌డా చైనా పేరు గానీ వూహాన్ పేరు గానీ లేదు. వైరస్ ప్రపంచంలో మొదటిగా వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

Read Here>> 1లక్షకు చేరువలో : భారత్ లో 24గంటల్లో 5వేలకు పైగా కరోనా కేసులు